Movie News

ప్లస్ అనుకుంటే మైనస్ అయ్యేలా ఉన్నాడే..

అక్కినేని నాగచైతన్య కెరీర్ ఒక అడుగు ముందుకేస్తే.. రెండడుగులు వెనక్కి పడ్డట్లు తయారైంది. పెద్ద బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ ఎంత ప్రయత్నించినా మాస్ ఇమేజ్ సంపాదించలేకపోయిన చైతూ.. చివరికి తనకు కలిసొచ్చిన లవ్ స్టోరీలతోనే విజయాలందుకుంటూ వచ్చాడు. కానీ అవి అతడి ఇమేజ్‌ను, మార్కెట్‌ను అనుకున్న స్థాయిలో పెంచలేకపోయాయి. సినిమా బాగుంటే ఓకే కానీ.. అటు ఇటు అయితే కలెక్షన్లు మరీ దారుణంగా ఉంటున్నాయి.

తాజాగా ‘థాంక్యూ’ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ఫుల్ రన్లో ఐదు కోట్ల షేర్ కూడా సాధించలేని దుస్థితి తలెత్తింది. ఈ రిజల్ట్ చైతూ బాక్సాఫీస్ సత్తా మీద అందరికీ సందేహాలు రేకెత్తించింది. ‘థాంక్యూ’ రిలీజైన మూడు వారాలకే అతను నటించిన మరో చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల కానుండగా.. ఈ సినిమాకు చైతూ వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉంటుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో దాదాపు అరగంట కనిపించే కీలక పాత్రలో చైతూ నటించాడు. నిజానికి ఈ పాత్రకు ముందు అనుకున్నది తమిళ నటుడు విజయ్ సేతుపతిని. అతను కూడా ఓకే అన్నాడు. కానీ డేట్లు సర్దుబాటు కాకో, మరో కారణంతోనో అతను తప్పుకున్నాడు. తర్వాత ఈ పాత్రకు ఎవరు బాగా సెట్టవుతారా అని చూసి చైతూను ఎంచుకున్నారు. తెలుగు మార్కెట్లో చైతూ వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని అనుకున్నారు.

కానీ ఇప్పుడు ‘థాంక్యూ’ ఫలితం చూశాక సినిమాకు చైతూ ప్లస్సా మైనస్సా అన్న ప్రశ్న తలెత్తుతోంది. సేతుపతిని పెట్టుకుని ఉంటే సౌత్ ప్రేక్షకులందరిలోనూ ప్రత్యేక ఆసక్తి ఉండేది. నటుడిగా అతడికున్న గుర్తింపు అలాంటిది. ఆమిర్ ఖాన్ సినిమాలో సేతుపతిని చూడటం ప్రత్యేకంగా అనిపించేది. ముఖ్యంగా తమిళంలో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చేది. తెలుగులో కూడా సేతుపతి నటన కోసం చూసే వాళ్లు చాలామందే ఉన్నారు. కానీ ఇప్పుడు దక్షిణాదిన మిగతా భాషల్లో చైతూ వల్ల ప్రయోజనం ఏ ప్రయోజనం లేకపోగా.. తెలుగులో అతను ఏమేర ప్రేక్షకులను ఈ సినిమా వైపు ఆకర్షించగలడో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

This post was last modified on August 1, 2022 3:46 pm

Share

Recent Posts

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

12 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

53 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

12 hours ago