కొన్ని నెలల కిందటే సన్ ఆఫ్ ఇండియా రూపంలో గట్టి ఎదురు దెబ్బ తిన్నారు మంచు మోహన్ బాబు. ఆ సినిమాకు తొలి రోజు ఒక్కో థియేటర్లో పది టికెట్లు తెగడం కూడా కష్టమైందంటే పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే.
ఒకప్పుడు హీరోగా, నిర్మాతగా భారీ విజయాలందుకుని వైవభం చూసిన ఆయనకు.. ఇప్పుడీ పరిస్థితి రావడం అభిమానులకు రుచించని విషయమే. ఈ దెబ్బతో మోహన్ బాబు సినిమాలు మానేసి ప్రశాంతంగా ఉంటారేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆయన అలా ఏమీ చేయట్లేదు.
ఈసారి తన కూతురితో కలిసి బాక్సాఫీస్ వేటకు వస్తున్నారు ఈ లెజెండరీ నటుడు. మోహన్ బాబు, లక్ష్మీప్రసన్న కలిసి అగ్ని నక్షత్రం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల ముందే దీని గురించి ప్రకటన వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఇందులో ఆయన ప్రొఫెసర్ విశ్వామిత్ర అనే పాత్ర చేస్తున్నట్లు వెల్లడైంది. హేర్ స్టైల్ మార్చి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తున్న మోహన్ బాబు నడివయస్కుడిగా దర్శనమిస్తారని అనిపిస్తోంది.
మోహన్ బాబును ప్రొఫెసర్ పాత్రలో చూడడం ఆయన అభిమానులకు కొత్తగానే ఉంటుంది. ఈ చిత్రాన్ని ప్రతీక్ ప్రజోష్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టైటిల్ మోషన్ పోస్టర్‌ను బట్టి చూస్తే ఇదొక ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీలా అనిపించింది.
మోహన్ బాబు-లక్ష్మీ ఇందులో ఒకరినొకరు ఢీకొట్టే పాత్రల్లో కనిపిస్తారని అంటున్నారు. మరి తండ్రి ప్రొఫెసర్ పాత్రలో కనిపించబోతున్నాడంటే.. కూతురు ఏ క్యారెక్టర్ చేస్తోందన్నది ఆసక్తికరం. త్వరలోనే ఆ విషయం వెల్లడి కాబోతోంది. ఈ చిత్రాన్ని మోహన్ బాబు, లక్ష్మి కలిసి తమ బేనర్ల మీద నిర్మిస్తుండడం విశేషం.
This post was last modified on August 1, 2022 8:57 am
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…