మెగాస్టార్‌కు నచ్చలేదు.. పవర్ స్టార్‌కు టైమ్ సరిపోదు

ఓ యంగ్ హీరోని ఒకే ఒక్క సినిమాతో స్టార్‌గా చేయగల సత్తా ఉన్న దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి.  ‘సింహాద్రి’ మూవీతో ఎన్టీఆర్‌ను స్టార్‌ను చేసిన రాజమౌళి, ‘మగధీర’తో చిరూ తనయుడు రామ్ చరణ్‌కు తిరుగులేని ఇమేజ్‌ను తెచ్చిపెట్టాడు. ఇప్పుడు ఈ ఇద్దరినీ కలిపి ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కిస్తున్నారు. అలాంటి సంచలన చిత్రాల  డైరెక్టర్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో మూవీ చేస్తే, దాని రేంజ్ ఊహించడం కూడా కష్టమే. ఫ్లాప్ టాక్‌తోనే రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టే పవన్‌, రికార్డుల రారాజు రాజమౌళి కలిస్తే బాక్సాఫీస్ బద్ధలైపోవడం గ్యారెంటీ. మరి రాజమౌళి ఆ ఛాన్స్ వస్తే చేస్తాడా?

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్‌తో సినిమా గురించి చెప్పుకొచ్చాడు జక్కన్న. పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని… కొన్నేళ్ల కిందట ఆయన్ని కలిసి స్క్రిప్ట్ కూడా వినిపించాడట రాజమౌళి… అయితే క్రియేటివ్ విభేదాల కారణంగా ఆ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని చెప్పారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నా… తన సినిమా కోసం కావాల్సినన్ని డేట్స్ ఇచ్చేంత సమయం ఆయన దగ్గర ఉండకపోవచ్చని అన్నారు రాజమౌళి. అలాగే మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా చేయాలనే ఆలోచన ఉందని మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు రాజమౌళి. ఇప్పటికైతే ‘ఆర్ఆర్ఆర్’, ఆ తర్వాత మహేష్‌తో ప్రాజెక్ట్ గురించే మాత్రమే ఆలోచిస్తున్నానని… ఈ రెండూ పూర్తయిన తర్వాతే మిగిలిన వాటి గురించి ఆలోచిస్తానని చెప్పాడీ సెన్సేషనల్ డైరెక్టర్. కాకపోతే గతంలో మెగాస్టార్ కు ఎన్ని స్టోరీలు చెప్పినా నచ్చలేదని కూడా సెలవిచ్చాడు. వర్కవుట్ కాలేదు అన్నాడు.

తారక్, చెర్రీలను కలిపి ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కిస్తున్నట్టుగా… చిరూ, పవన్‌లతో ఓ మెగా మల్టీస్టారర్ తీయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెగా, నందమూరి వారసులను ‘ఆర్ఆర్ఆర్’తో కలిపిన రాజమౌళి తలుచుకుంటే ఇది అసాధ్యమేమీ కాదు. అయితే ఈ మెగా ప్రాజెక్ట్‌కు తగిన కథ రావడమే కష్టమంటున్నారు జక్కన్న. కథ వస్తే, ఫ్యూచర్‌లో ఈ మెగా మల్టీస్టారర్ తీస్తానని ఫ్యాన్స్‌కు భరోసా ఇచ్చారు.