ఆగస్ట్ 1 నుండి షూటింగ్స్ బంద్ కానున్న సంగతి తెలిసిందే. ఇటివలే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ గిల్డ్ ఈ మేరకు నిర్ణయం తీసేసుకుంది. ఉన్నపళంగా నిర్మాతల మండలి బంద్ కి పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. సినిమా నిర్మాణ ఖర్చు , నష్టాలపై కొన్ని రోజులుగా మీటింగ్స్ పెట్టుకుంటున్న యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ ఫైనల్ గా బంద్ ప్రకటించింది. దీంతో మరో మూడు రోజుల్లో బడా సినిమాల షూటింగ్స్ క్యాన్సిల్ అవ్వనున్నాయి. అయితే ఈ బంద్ కారణంగా బడా సినిమాలపై బాగా ఎఫెక్ట్ పడనుంది.
ముఖ్యంగా మెగా సినిమాలపై ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉండనుంది. మెగా స్టార్ చిరంజీవి వరుసగా మూడు సినిమాలు చేస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు చిరు -సల్మాన్ ఖాన్ లపై ఓ సాంగ్ తీయాల్సి ఉంది. అలాగే బాబీ డైరెక్షన్ లో చిరు నటిస్తున్న షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటివలే రవితేజ కూడా షూట్ లో జాయిన్ అయ్యాడు. రవితేజ డేట్స్ లాక్ అయిపోయాయి. ఇక మెహర్ రమేష్ తో చేస్తున్న సినిమా కూడా సగంపైనే షూటింగ్ ఉంది. త్వరలోనే మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ ప్లాన్ మార్చుకోక తప్పదు.
ఏదేమైనా మెగా సినిమాలపై బంద్ ప్రభావం గట్టిగా పడబోతుంది. కాల్షీట్స్ ఇష్యూలతో మెగా సినిమాల షూటింగ్స్ అన్ని వాయిదా పడటం ఖాయమనిపిస్తుంది. అసలే ‘గాడ్ ఫాదర్’ తో పాటు బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కూడా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాడు చిరు. బంద్ వల్ల ఏ మాత్రం షూటింగ్స్ ఆగిపోయిన ఆ డేట్స్ ని అందుకోవడం కష్టమే. షూటింగ్స్ బంద్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియని పరిస్థితి. పెద్దలు ముందుకొచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరించుకుంటే బెటర్. లేదంటే రోజు కూలి పనిచేసే సినీ కార్మికులు ఇబ్బంది పడతారు.