Movie News

చై-సామ్.. ఒక ఇంటి కథ

టాలీవుడ్ చరిత్రలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్స్ జాబితా తీస్తే నాగచైతన్య-సమంతల జంట పేరు కచ్చితంగా ఉంటుంది. వీరి ప్రేమాయణం గురించి వార్తలు బయటికి వచ్చినప్పటి నుంచి మీడియాలో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. కారణాలేంటన్నది పక్కన పెడితే ఈ జంట అందరికీ చూడముచ్చటగా అనిపించింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనిపించుకున్నారు అందరితోనూ. పెళ్లి జరిగినపుడు, ఆ తర్వాత చూసేవాళ్లందరికీ ఈ జంట చాలా అన్యోన్యంగా కనిపించింది. అలాంటి జంట పెళ్లయి నాలుగేళ్లు తిరక్కముందే విడాకులు తీసుకోవడం అందరికీ పెద్ద షాక్. కొంతమంది ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

సోషల్ మీడియాలో ఇటు చైతూకు, అటు సమంతకు.. మళ్లీ కలిసిపోవాలని మెసేజ్‌లు పెట్టే వాళ్లు చాలామందే ఉన్నారు. ఐతే సామాన్యులే కాదు.. మురళీ మోహన్ లాంటి సినీ లెజెండ్ సైతం తనకు కాస్త ముందుగా విడాకుల గురించి తెలిస్తే ఇద్దరితో కలిసి మాట్లాడేవాడినని వ్యాఖ్యానించడం విశేషం. చైతూ-సామ్ తన ఇంట్లోనే ఉండేవారని వెల్లడిస్తూ.. ఆ ఇంటికి సంబంధించి ఆసక్తికర విశేషాలను ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘‘హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో మాకు కొన్ని అపార్ట్‌మెంట్లున్నాయి. వాటిలో మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మూడు ఇళ్లు నిర్మించుకున్నాం. ఒకసారి చైతూ-సమంత మా అపార్ట్‌మెంట్స్ చూడడానికి వచ్చారు. మేం ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న ఇళ్లలో ఒకటి వాళ్లిద్దరికీ బాగా నచ్చింది. అది తమకు కావాలని అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. దీంతో వాళ్లు కొంత నిరాశకు గురయ్యారు. కానీ కొన్ని రోజుల తర్వాత నాగార్జున నన్ను అడిగితే కాదనలేక ఆ మూడు ఇళ్లలో ఒకటి చైతన్యకు ఇచ్చాను.

పెళ్లయ్యాక చైతూ, సామ్ ఆ ఇంట్లోనే ఉన్నారు. చాలా చూడముచ్చటగా అనిపించేవారు. ఎప్పుడూ వాళ్లు గొడవపడడం చూడలేదు. తిట్టుకోవడం, వాగ్వాదాలు జరిగిన ఘటనలు కూడా ఆ ఇంట్లో జరిగేవి కావు. ఫ్రెండ్స్, వీకెండ్ పార్టీలు లాంటివేమీ ఆ ఇంట్లో ఉండేవి కాదు. ఎప్పుడూ ఇల్లు ప్రశాంతంగా ఉండేది. వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్న విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. మా ఇంట్లో పని చేసేవాళ్లు.. చైతూ, సామ్ విడిపోయారని, తమ సామానంతా తీసుకుని వెళ్లిపోయారని చెప్పారు. అది విని నేను షాకయ్యాను. ఒకవేళ ముందే తెలిసి ఉంటే వారితో మాట్లాడేవాడిని’’ అని మురళీ మోహన్ తెలిపారు.

This post was last modified on July 20, 2022 9:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

3 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

4 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

4 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

5 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

6 hours ago