ఆమిర్ ఖాన్ సినిమా అంటే ఒకప్పుడు ప్రేక్షకులు ఎగబడి థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు. భాషా భేదం కూడా ఉండేది కాదు. అతడి హిందీ చిత్రాలను సౌత్ ఆడియన్స్ బాగానే చూసేవారు. కానీ ఆమిర్ చివరి సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ డిజాస్టర్ కావడం, కొవిడ్ తర్వాత పరిస్థితులు దారుణంగా తయారవడం ఆమిర్ కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ మీద ప్రతికూల ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి.
ఈ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ అనే హాలీవుడ్ మూవీకి రీమేక్ కావడం, ట్రైలర్ కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు లేకపోవడం కూడా మైనస్సే అయ్యాయి. దీంతో ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాపీస్ సక్సెస్ మీద సందేహాలు నెలకొన్నాయి ట్రేడ్ వర్గాల్లో. అలా అని ఆమిర్ ఆషామాషీగా తన సినిమాను రిలీజ్ చేస్తాడనుకుంటే పొరబాటే. ప్రమోషన్ల విషయంలో ఇండియన్ సినిమాకు ఒక కొత్త మార్గం చూపించిన హీరోల్లో ఒకడు ఆమిర్. స్టార్ హీరోలు కూడా దేశమంతా తిరుగుతూ ప్రమోషన్లు చేయాల్సిన అవసరాన్ని తెలియజెప్పింది అతనే.
అందుకే వచ్చే నెల 12న రిలీజ్ కాబోయే తన సినిమా కోసం దేశమంతా తిరిగేయడానికి నిర్ణయించుకున్నాడు ఆమిర్. తన సినిమా తెలుగు వెర్షన్ మీద కూడా అతను ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. తన చిత్రంలో కీలక పాత్ర పోషించిన చైతూ కోసమని అతడి సినిమా ‘లవ్ స్టోరి’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఆమిర్ రావడం అప్పట్లో ఆశ్చర్యం కలిగించింది. అలాగే ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లోనూ పాల్గొన్నాడు. అందుకు ప్రతిగా ఇప్పుడు రాజమౌళి అక్కరకు వస్తున్నాడు.
తాజాగా హైదరాబాద్‌లో ‘లాల్ సింగ్ చడ్డా’ తెలుగు వెర్షన్ స్పెషల్ ప్రివ్యూ వేశారు. ఇందుకు వేదికైంది మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోని హోం థియేటర్ కావడం విశేషం. దానికి రాజమౌళితో పాటు నాగార్జున, సుకుమార్, రామ్ చరణ్, నాగచైతన్య కూడా హాజరయ్యారు. వీళ్లంతా సినిమా చూస్తున్న, ఆమిర్‌ను అభినందిస్తున్న వీడియో కూడా విడుదల చేశారు. ఈ చిత్రానికి చిరంజీవి సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. మరి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆమిర్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత మేర ఫలిస్తుందో చూడాలి. అలాగే సౌత్ ఆడియన్స్ ఈ సినిమాను ఏమేర ఆదరిస్తారు.. మొత్తంగా ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం వస్తుందన్నది ఆసక్తికరం.
This post was last modified on July 16, 2022 9:37 pm
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…