నితిన్ లక్కు భలే ఉందే

అప్పుడప్పుడు మనకొచ్చినట్టే సినిమా హీరోలకూ కొన్నిసార్లు లక్కు కలిసొస్తుంది. నితిన్ కేసులో ఇది కనిపిస్తోంది. వచ్చే నెల 12న విడుదల కాబోతున్న మాచర్ల నియోజకవర్గంకు ఉన్న పోటీ ఒక్కొక్కటిగా తప్పుకుంటోంది. అఖిల్ ఏజెంట్ ఎప్పుడో సైడ్ అయ్యాడు. కాన్ఫిడెంట్ గా వస్తుందనుకున్న విశాల్ లాఠీ ఇప్పుడు టెక్నికల్ రీజన్స్ తో పాటు గాయాలను సాకుగా చూపిస్తూ సెప్టెంబర్ కు షిఫ్ట్ చేశారు. సమంతా యశోద గత నెల రోజులుగా సైలెంట్ గా ఉన్నప్పుడే ఆ వారంలో రావడం లేదనే క్లారిటీ వచ్చేసింది. సో ముగ్గురు తప్పుకున్నారు.

ఇప్పుడు మాచర్ల నియోజకవర్గానికి ఉన్న అపోజిషన్ రెండే. మొదటిది లాల్ సింగ్ చడ్డా. ఎంత నాగ చైతన్య ప్రత్యేక పాత్ర చేసినా అది పక్కా అమీర్ ఖాన్ మూవీ. నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేంత మనవాళ్లకు ఎక్కే ఛాన్స్ తక్కువ. పైగా ట్రైలర్ వచ్చాక పెరగాల్సిన హైప్ అటు ట్రేడ్ లోనూ కనిపించడం లేదు. సో మాస్ అంతగా పట్టించుకోరు. ఇక విక్రమ్ కోబ్రా గురించి టెన్షనే అక్కర్లేదు. ఏదో కమల్ హాసన్ విక్రమ్ లాగా సడన్ సర్ప్రైజ్ ఇస్తే తప్ప ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉన్న ఆ సినిమా మీద అంచనాలు పెద్దగా లేవు..

ఎలా చూసుకున్నా నితిన్ బొమ్మలోనే మాస్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఈ మధ్యే వదిలిన అంజలి ఐటెం సాంగ్ యూట్యూబ్ లో మూడు రోజులు గడవకుండానే 11 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ఇది రికార్డే. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కం సోషల్ మెసేజ్ ఎంటర్ టైనర్ లో కృతి శెట్టి గ్లామర్ మరో ఆకర్షణ కానుంది. ఇప్పటికైతే పబ్లిసిటీ ఇంకా మొదలుపెట్టలేదు కానీ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఈ అవకాశాన్ని రెండు థియేట్రికల్ ఫ్లాపుల తర్వాత నితిన్ ఎంత మేరకు వాడుకుని హిట్టు కొడతాడో చూడాలి.