Movie News

స్వేచ్ఛ ఇవ్వ‌రు.. పెళ్లి చేసుకోమంటే అదే అడుగుతా: సాయిప‌ల్ల‌వి

సాయి ప‌ల్ల‌వి.. ఈ అమ్మ‌డుకు ఉన్న క్రేజు, డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ఎలాంటి స్కిన్ షో చేయ‌కుండా, కేవ‌లం త‌న స‌హ‌జ న‌ట‌న‌తోనే ఈమె స్టార్ హీరోల‌ స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకుంది. `లవ్ స్టోరీ`, `శ్యామ్ సింగ‌రాయ్‌` వంటి సూప‌ర్ హిట్స్ త‌ర్వాత సాయి ప‌ల్ల‌వి నుండి ఇటీవల `విరాట ప‌ర్వం` వ‌చ్చింది. ఈ మూవీ క‌మర్షియ‌ల్ గా హిట్ అవ్వ‌క‌పోయినా.. సాయి ప‌ల్ల‌వికి మాత్రం విమ‌ర్శ‌కుల నుండి ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఇప్పుడు సాయి ప‌ల్ల‌వి `గార్గి` అనే మూవీతో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వ‌హించిన‌ లేడీ ఓరియెంటెడ్ చిత్ర‌మిది. కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మీ, వి.జయప్రకాష్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. త‌ప్పుడు కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్లిన తండ్రి కోసం న్యాయ వ్యవస్థపై కూతురు చేసే పోరాట‌మే ఈ సినిమా క‌థ‌. ఇందులో సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య త‌ర‌గతి కుటుంబానికి చెందిన గార్గి అనే అమ్మాయిగా, టీచ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.

ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఇకపోతే అన్ని కార్య‌క్ర‌మాల‌ను చ‌క‌చ‌కా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం జూలై 15న తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. తెలుగులో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై రానా ద‌గ్గుబాటి.. త‌మిళంలో 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య, జ్యోతిక‌లు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు.

రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సాయి ప‌ల్ల‌వి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంట‌ర్వ్యూలో ఆమె ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది. అమ్మాయిల‌కు ఇచ్చే స్వేచ్ఛ, త‌న పెళ్లి వంటి అంశాల‌పై సైతం సాయి ప‌ల్ల‌వి మాట్లాడింది. అస‌లేమైందంటే.. ఇంట‌ర్వ్యూలో `అమ్మాయిలపై వివక్ష ఉంటుందనే అంశాన్ని గార్గి సినిమాలో ప్రస్తావిస్తున్నారా?` అనే ప్ర‌శ్న సాయి ప‌ల్ల‌వి ఎదురైంది.

అందుకు ఆమె బ‌దులిస్తూ.. `స‌హజంగా ఒక అబ్బాయికి ఇచ్చిన స్వేచ్ఛ అమ్మాయికి ఇవ్వరు. మా ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోమని త‌ర‌చూ అడుగుతుంటారు. ఆ సందర్భాల్లో ఒక అబ్బాయి అయితే ఇలాగే త్వరగా పెళ్లి చేసేస్తారా..? అని అడుగుతుంటా. అలాంటివే ఈ సినిమాలోనూ ఉంటాయి. సందేశాత్మక సినిమా కాక‌పోయినా.. వినోదాన్ని అందిస్తూనే అందరినీ ఆలోచింపజేస్తుంది.` అని పేర్కొంది. మొత్తానికి పెళ్లి విష‌యంలో త‌న‌కూ ఇంట్లో ఒత్తిడి ఉంద‌ని సాయి ప‌ల్ల‌వి చెప్ప‌క‌నే చెప్పేసింది. 

This post was last modified on July 12, 2022 3:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

1 hour ago

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

2 hours ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

2 hours ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

3 hours ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

3 hours ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

3 hours ago