బ్లాక్ బస్టర్ రన్ తో ఏకంగా 400 కోట్ల గ్రాస్ తో సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న విక్రమ్ రెండు రోజుల క్రితం డిస్నీ హాట్ స్టార్ లో ఓటిటి ప్రీమియర్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని సెంటర్లలో వీకెండ్ కలెక్షన్లు స్థిరంగా ఉన్నాయి. స్మార్ట్ స్క్రీన్ లోకి వచ్చాక సోషల్ మీడియా మొత్తం విక్రమ్ ఫీవర్ తో ఊగిపోతోంది. ముఖ్యంగా అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కమల్ ఫహద్ విజయ్ సేతుపతిల అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ కోసం మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వ్యూస్ లో రికార్డులు నమోదు కావడం ఖాయమే.
ఇదిలా ఉండగా అమెరికాలో మాత్రం విక్రమ్ అందుబాటులోకి రాలేదు. మాములుగా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేసుకున్నసినిమాలు అక్కడ హులు యాప్ లో వస్తాయి. అది కూడా డిస్నీ వాళ్లదే. అఖండ, భీమ్లా నాయక్ లాంటివి అందులోనే యుఎస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. విక్రమ్ కూడా అలాగే చూడొచ్చని అనుకున్నారు. తీరా చూస్తే మొన్న స్ట్రీమింగ్ డేట్ జూలై 8న హులులో లేదు. కారణమేంటా అని ఆరా తీస్తే హక్కులు కేవలం యుఎస్ ని మినహాయించి మిగిలిన దేశాలకు మాత్రమే ఇచ్చారట. అందుకే అక్కడ ప్రత్యక్షం కాలేదు.
విక్రమ్ ఓవర్సీస్ లోనూ బాగా పెర్ఫార్మ్ చేసింది. కాకపోతే ఇండియాలో చూసినట్టుగా ఇంట్లోనే మళ్ళీ చూసే వెసులుబాటు లేకపోవడం వాళ్ళను బాధ పెడుతోంది. ఇక్కడి లాగా యుఎస్ లో విచ్చలవిడి పైరసీ వెర్షన్లు చూసే వెసులుబాటు ఉండదు. అక్కడి సైబర్ ఫైర్ వాల్స్ చాలా పటిష్టంగా ఉంటాయి. దాంతో ఓటిటిలో వచ్చినప్పుడు తప్ప వేరే ఆప్షన్స్ పెద్దగా ఉండవు. మరి కమల్ విదేశీ అభిమానుల గోడు విని ఎందులో విక్రమ్ ని అందుబాటులో తెస్తారో చూడాలి. ఫైనల్ గ్రాస్ 500 కోట్లకు చేరొచ్చనే అంచనా ఉంది.
This post was last modified on July 10, 2022 2:14 pm
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…