టాలీవుడ్ లోనే కాదు ఏ భాషలో అయినా హీరోలకు ఎంత వయసొచ్చినా వాళ్ళ పక్కన ఆడిపాడే భామలు మాత్రం యవ్వనంలోనే ఉండాలి. లేదంటే అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఒప్పుకోరు. అందుకే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ల సరసన మనవరాలి వయసున్న శ్రీదేవి డాన్స్ చేస్తే ఆహా ఓహో అంటూ మురిసిపోయారు. ఇప్పటికీ చిరు బాలయ్యలతో జట్టు కడుతోంది శృతి హాసన్ తమన్నా లాంటి యంగ్ బ్యూటీసే. ఈ మినహాయింపు హీరోయిన్లకు ఉండదు. మహా అయితే ఓ పదేళ్లు స్టార్ డం చూశాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా షిఫ్ట్ అయిపోతారు.
దీనికి ప్రభాస్ సినిమాకు సంబంధం ఏంటనేగా మీ డౌట్. అక్కడికే వద్దాం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందబోయే స్పిరిట్ లో తనకు జోడిగా కరీనా కపూర్ (బెబో) పేరు పరిశీలనలో ఉందనే వార్త ముంబై మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది విన్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకంటే కరీనా ఎప్పుడో 2000 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చింది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో ఉన్నాయి. ఆ తర్వాత అందరి లాగే అవకాశాలు తగ్గిపోయి పెళ్లి చేసుకుని కుటుంబ జీవితానికి అంకితమయ్యాక సెలెక్టివ్ గా ఉంటోంది.
తన చేతిలో ఉన్న చెప్పుకోదగ్గ సినిమా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా ఒక్కటే. ఇప్పుడీ స్పిరిట్ రికమండేషన్ కూడా అది పురుష్ విలన్ అలియాస్ కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ ద్వారా వచ్చి ఉండొచ్చన్న టాక్ కూడా ఉంది. మరీ ఇంత ముదురు భామనా అని కామెంట్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. స్పిరిట్ కు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడే నిర్ధారణకు రాలేం కానీ ఇంకొంత కాలం వెయిట్ చేయాలి. సందీప్ ప్రస్తుతం రన్బీర్ కపూర్ తో యానిమల్ షూట్ లో బిజీ ఉన్నాడు. అదయ్యాకే స్పిరిట్ అప్ డేట్ ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు
This post was last modified on July 8, 2022 2:43 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…