Movie Reviews

సమీక్ష – హ్యాపీ బర్త్ డే

చదవేస్తే ఉన్న మతి పోయింది అన్నది సామెత. మత్తు వదలరా అనే సినిమాతో కాస్త వైవిధ్యమైన సినిమ అందించాడని పేరు తెచ్చుకున్న దర్శకుడు రితేష్ రానా కు ఈ సామెత అచ్చంగా సరిపోతుందేమో? సర్రియలిస్టిక్ కామెడీ లేదా అతిహాస్యం అనే జానర్ ను లైట్ గా టచ్ చేస్తూ మత్తు వదలరా సినిమా అందించాడు. ఇప్పుడు అదే జానర్లో అనకాపల్లి నుంచి అమెరికా అంత దూరం వెళ్లిపోయి, పండిత..పామర జనాలు అందరికీ అందనంత దూరంలో సర్రియలిస్టిక్ కామెడీ సినిమా ను అందించాడు. అదే ‘హ్యాపీ బర్త్ డే’.

హ్యాపీ బర్త్ డే కథేంటీ అని అడగకూడదు. ఎందుకంటే దర్శకుడు కూడా చెప్పలేడు. పోనీ సినిమాను సింగిల్ లైన్ లోనో, పది లైన్లలోనో, పాతిక లైన్లలోనో కథను చెప్పమంటే కూడా చూసిన ప్రేక్షకుడు చెప్పలేడు. సినిమాకు ప్రధానమైన సమస్య అదే. బేసిక్ గా కథ అన్నది సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థం అయ్యే రేంజ్ లో వుంటే, దాని చుట్టూ ఎన్ని మొగ్గలు వేసినా బాగుంటుంది. లేదూ అలా కాకుండా కేవలం జబర్దస్ట్ స్కిట్ లు చూపిస్తాం అంటే ప్రతి ఇంట్లోనూ టీవీ వుండనే వుంది.

దర్శకుడు ఈ తరహా లేదా ఈ జానర్ ఇలాగే వుంటుంది..మీరు ఆ లెవెల్ కు రీచ్ కావాలి అని అంటే చేసేదేమీ లేదు. సినిమాను పక్కన పెట్టడం తప్ప. ఇప్పుడు అదే జరుగుతుంది ఈ సినిమా. అసలు సినిమా ఎత్తుగడ వేరు. నడక వేరు..చేరిన తీరం వేరు.

సినిమా ఎత్తుగడ ఏమిటంటే పార్లమెంట్ లో ఆయుధాల చట్టానికి సవరణ ప్రవేశ పెట్టడం. ప్రతి మనిషికి బటానీలు అందుబాటులో వున్నంతగా ఆయుధాలు అందుబాటులోకి రావడం. కేంద్ర మంత్రి (వెన్నెల కిషోర్) చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడంతో సినిమా ప్రారంభం అవుతుంది. దర్శకుడికి వున్న వెటకారం పాళ్లు ఈ సీన్ ను చాలా రసవత్తరంగా పండిస్తాయి. వాస్తవానికి ఇలాంటి వెటకారం సినిమాలో అడుగు అడుగునా తొంగి చూస్తుంది. ముఖ్యంగా మాటల్లో, కొన్ని చోట్ల దృశ్యాల్లో. కానీ వాటిని అన్నింటినీ కామన్ ఆడియన్ రిసీవ్ చేసుకోవడం దగ్గరే వస్తుంది. అసలే సినిమా పరుగుపెడుతూ వుంటుంది. లైటింగ్, కలరింగ్ స్కీమ్ కాస్త గజిబిజీగా వుంటుంది. కథ అంతు పట్టదు. ఇలా అన్నీ ఒకేసారి మీద పడడంతో అన్నప్రాసన నాడే ఆవకాయ అన్నం అన్నట్లు తయారవుతుంది పరిస్థితి.

అలా పార్లమెంట్ లో ప్రారంభమైన సినిమాకు అక్కడి నుంచి చాప్టర్లు, చాప్టర్ల మాదిరిగా ఒక్కో లేయర్ ను పరిచయం చేస్తూ వెళ్తాడు దర్శకుడు. ఒక్కో లేయర్ ఒక్కో ట్రాక్ మాదిరిగా రన్ అవుతూ వుంటుంది. వైవా హర్ష ట్రాక్ కు ప్రధాన కథతో అస్సలు సంబంధం వుండదు. సినిమాలో మిగిలిన లేయర్లకు కూడా సినిమాతో ఏంటీ కనెక్షన్ అన్నది అంత సులువుగా కామన్ ఆడియన్స్ కు అందదు.

కళ్ల ముందుకు వస్తున్న పాత్రలు, అవి చేస్తున్న కామెడీలు చూసి ఎంజాయ్ చేయడమే. కానీ కొన్ని సీన్లను మంచి ఫన్ తో తయారు చేసిన దర్శకుడు చాలా సీన్లను బోర్ కొట్టించాడు. ఇలా బోర్ కొట్టడం ఎందువల్ల అంటే కథ ఏమిటీ అన్నిది ప్రేక్షకుడికి తెలియకపోవడం వల్లనే. అతడు సినిమాలో ఎమ్ ఎస్ నారాయణ పరిస్థితి అవుతుంది ప్రేక్షకుడిది.

సినిమా తొలిసగం ఓకె అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కో లేయర్ వస్తూ, ఎంతో కొత్త ఫన్ జనరేట్ చేస్తూ వుంటాయి. కథ కొంచెం కొంచెం అర్థం అవుతూ వుంటుంది. ఓ లైటర్ కోసం అంతా జరుగుతోందని అనిపిస్తుంది. దాంతో మంచి హోప్ తో ద్వితీయార్థం చూడాలనుకుంటాడు. ఇక అక్కడి నుంచి దర్శకుడికి మరింత ధైర్యం వచ్చేస్తుంది. ఈ మాత్రం అతి చేస్తేనే చూసారు. ఇంకా చేస్తే ఇంకెంత ఎంజాయ్ చేస్తారో అని ఎక్కడలేని లేయర్లు తెచ్చి ఇరికించేస్తాడు. చివరకు వస్తున్న కొద్దీ కథ అన్నది ఇంకా జటిలం అయిపోతుంది. ఆఖరికి ముగిసిపోయే వ్యవహారం కూడా ఏమంత మజాగా వుండదు. శుభం అని ఎండ్ టైటిల్ వేయడానికి బదులు ‘భంశు’ అని వేసినంత తింగరి తనంగా వుంటుంది.

దర్శకుడి కామెడీ సృజన చాలా వరకు బాగానే వుంది. కానీ అది ముక్కలు ముక్కలుగా వుంది సినిమాలో. దాని ప్రోపర్ గా గుదిగుచ్చి, దానికి జస్ట్ చిన్నదో, పెద్దదో అర్థమయ్యే కథను జోడించి వుంటే సినిమా పరిస్థితి వేరుగా వుండేది. సినిమాకు వెళ్లిన ఆడియన్స్ పరిస్థితి కాస్త బాగుండేది. ప్రేక్షకులకు అలవాటైపోయిన పాట్రన్ నుంచి కాస్త పక్కకు తిప్పడం వేరు. పూర్తిగా రివర్స్ లో వెళ్లడం వేరు. ఈ సినిమాకు అన్ని విధాలా అదే సమస్య. ఒక హీరో వుండడు. హీరోయిన్ కు ఎందుకోసమో డబుల్ రోల్. గుండు సుదర్శన్ పాత్ర ఏమిటో అర్థం కాదు. అస్సలు కేంద్ర మంత్రి డీల్ గురించి ఇంత మందికి ఎందుకు అవసరమో అన్నది క్లారిటీ వుండదు. అంత డబ్బు ఆ పబ్ లోనో, ఆ హోటల్ లోనో వుండడం ఏమిటో తెలియదు. అంతా అయిపోయిన తరువాత మళ్లీ మంత్రికి, ఆయుధాల వ్యాపారికి డిస్కషన్ ఏమిటో అర్థం కాదు. ఇలా అర్థం కాదు..అర్థం కాదు..అనే విషయాలు చాలా వున్నాయి.

ఇలాంటి సినిమాలో కమెడియన్లు అంతా సీన్లకు తగినట్లు చేసేసారు. తప్ప సింక్ లేదు. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగానే వుంది. సినిమాటోగ్రఫీ జానర్ కు తగినట్లు కాస్త గజిబిజిగానే సాగింది. మొత్తం మీద పిచ్చి ముదిరింది రోకలి చుట్టండి అనే సామెతకు ఉదాహరణ ‘హ్యాపీ బర్త్ డే’.

ప్లస్ పాయింట్లు

కామెడీ సీన్లు

మైనస్ పాయింట్లు

కథ, కథనాలు

ఫినిషింగ్ టచ్: ‘మత్తు వదిలిపోయింది’

Rating: 2/5

This post was last modified on July 8, 2022 4:18 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష…

6 hours ago

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

7 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

11 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

14 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

15 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

16 hours ago