జాగ్రత్త పడుతున్న ‘థాంక్యూ’ టీం …

నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబోలో వస్తున్న ‘థ్యాంక్యూ’ కి సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు టీం. తాజాగా చైతూ , రాశి రంగంలోకి దిగి సినిమాను ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ మధ్య కాలేజిలో ఫేర్ వెల్ సాంగ్ లాంచ్ చేశారు. ముందుగా టీజర్ తో సినిమా ప్రమోషన్ మొదలు పెట్టారు. అయితే టీజర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచడంలో విఫలమైంది. ముఖ్యంగా ప్రేమమ్, మహర్షి లతో పోలుస్తూ టీజర్ ని ట్రోల్ చేశారు. నిజానికి సినిమా థీమ్ అంతా అలానే ఉంది.

అక్కడక్కడా మజిలీ ఛాయలు కూడా టీజర్ లో కనిపించాయి. అందుకే ఇప్పుడు మేకర్స్ ట్రైలర్ విషయంలో జాగ్రత్త పడుతూ కేర్ తీసుకుంటున్నారు. అలాంటి కంపెరిజన్స్ లేకుండా క్లియర్ గా బెస్ట్ విజువల్స్ తో ఓ ట్రైలర్ వదలాలని చూస్తున్నారు. ఇప్పటికే ఓ కట్ రెడీ అయింది. మరో రెండ్రోజుల్లో అంటే జులై 9న కానీ 10 న ట్రైలర్ ని ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. దిల్ రాజు కూడా ట్రైలర్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.

ఏదేమైనా ఈ సినిమాతో చైతుకి ఎట్టిపరిస్థితుల్లో హిట్ ఇవ్వాలని భావిస్తున్నాడు దిల్ రాజు. తన బేనర్ లోనే హీరోగా చైతుని పరిచయం చేసి జోష్ తో హిట్ ఇవ్వలేకపోయిన దిల్ రాజు ఈసారి నాగార్జున తనని నమ్మి అప్పుడు చైతు మొదటి సినిమా ఇచ్చినందుకు థాంక్యూ చెప్పి హిట్ ఇస్తాడేమో చూడాలి.