కొరటాల శివ హాట్ షాట్ డైరెక్టర్ అయినా కానీ రెండేళ్లుగా ఆచార్య సినిమాతోనే ఉండిపోయాడు. ఆయన మరో ఏడాది పాటు ఇదే సినిమాతో స్టక్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంత పెద్ద దర్శకుడికి ఇది కచ్చితంగా విసుగు తెప్పించే విషయమే.
అయినా కానీ ఇప్పుడు ఎటూ కదలలేని పరిస్థితి. మళ్ళీ షూటింగ్స్ ఎప్పటికి మొదలవుతాయో తెలియని పరిస్థితులలో ఖాళీగా ఉన్న కొరటాల శివ ఈ టైంలో ఒక నిర్మాణ సంస్థకు స్క్రిప్ట్ సలహాదారుగా వ్యవహరిస్తున్నది. అంటే ఆ సంస్థ దగ్గరకు వచ్చే దర్శకుల కథలు కొరటాల శివ విని ఓకే చేస్తాడట. అలాగే మార్పు చేర్పులు ఏమైనా అవసరమైతే చెప్తాడట.
అలా చేసినందుకు గాను ఆయనకు రాయల్టీతో పాటు సదరు సినిమాలో కాస్త వాటా కూడా దక్కుతుందట. రచయితగా మంచి అనుభవమున్న కొరటాల ప్రస్తుతం ఆ అనుభవాన్ని ఇలా ఉపయోగించుకుంటున్నారన్నమాట
Gulte Telugu Telugu Political and Movie News Updates