హిట్టు కోసం ఎదురుచూస్తున్న రాశి

Raashi Khanna

హీరోయిన్ గా రాశి ఖన్నా చాలా సినిమాలు చేసినప్పటికీ ఆమె హిట్ సినిమాలు వేళ్ళ మీద లెక్కేయొచ్చు. అవును అమ్మడి హిట్ల కంటే ఫ్లాపుల సంఖ్యే ఎక్కువ మరి. ‘ప్రతి రోజు పండగే’ తర్వాత రాశి నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ , ‘పక్కా కమర్షియల్’ డిజాస్టర్స్ అనిపించుకున్నాయి. దీంతో ఇప్పుడు రాశి ఆశలన్నీ ‘థాంక్యూ’ మీదే పెట్టుకుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి టాలీవుడ్ లో మళ్ళీ వరుస ఆఫర్స్ అందుకోవాలని చూస్తుంది.

చైతూతో ఆల్రెడీ ‘వెంకీ మామ’ సినిమాలో జోడి కట్టింది రాశి. ఆ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేదు. దీంతో ఈ పెయిర్ హిట్ అనిపించుకోలేకపోయింది. ఇప్పుడు ఆ మచ్చ కూడా థాంక్యూ తో చెరిపేయాలని భావిస్తుంది. ఇక సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉన్నారు. మాళవిక , అవిక కూడా చైతుకి జోడిగా కనిపించనున్నారు. ఒకవేళ సినిమా హిట్టైనా రాశి కి దక్కే క్రెడిట్ తక్కువే. కానీ ఆమె లిస్టులో ఓ హిట్ పడుతుంది అంతే.

పక్కా కమర్షియల్ మీద చాలానే హోప్స్ పెట్టుకున్న రాశి ఆ సినిమా డమాల్ అవ్వడంతో ఇప్పుడు థాంక్యూ మళ్ళీ తెలుగులో తనకి ఓ హిట్ అందిస్తుందనుకుంటుంది. చూడాలి డిల్లీ బ్యూటీ చైతు సినిమాతో హిట్ కొడుతుందో లేదో ?