SP బాలు గారి గురించి కొత్తగా చెప్పుకోనక్కరలేదు. ఎన్నో వేల పాటలతో మన చెవిలో అమృతం పోసిన మహా గాయకుడు ఆయన. బాలు గారు స్వర్గస్తులయ్యాక ఆయన్ని తలపించే గానం మళ్ళీ వినిపిస్తుందా ? అంటే కష్టమనే సమాధానం వినిపించింది. కానీ ప్రస్తుతం బాలు తనయుడు తన తండ్రి టోన్ ని తలపిస్తూ ఆయన దారిలోనే వెళ్తున్నాడు.
బాలు గారు మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఎస్ పి చరణ్ కి తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. తను పాడిన కొన్ని పాటలు ఇన్స్టాంట్ హిట్టయ్యాయి కూడా. కానీ ఎందుకో ఆ టైంలో సింగర్ గా క్లిక్ అవ్వలేకపోయాడు. తర్వాత చెన్నయ్ లో సెటిలై అక్కడే ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ ఉండిపోయాడు. మధ్య మధ్యలో అరా కొరా పాటలు మత్రమే పాడాడు. అయితే ఇప్పుడు సింగర్ గా మళ్ళీ బిజీ అవుతున్నాడు చరణ్.
తండ్రి వారసత్వాన్ని పొనికి పుచ్చుకొని సింగర్ గా సత్తా చాటుకుంటున్నాడు. ఇప్పటికే తండ్రి హోస్ట్ చేసిన ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం ని హ్యాండిల్ చేస్తున్న చరణ్ ఇప్పుడు వరుస పాటలతో టాలీవుడ్ లో బిజీ సింగర్ గా మారుతున్నాడు. తాజాగా ‘సీతా రామమ్’ అనే సినిమాలో రెండు పాటలు పాడాడు చరణ్. ఆ పాటలతో తండ్రి గొంతును కొంత గుర్తుచేశాడు. అలాగే తెలుగులో ఇంకొన్ని సాంగ్స్ పాడాడు అవి రిలీజ్ అవ్వాల్సి ఉంది. పెద్ద సినిమాల్లోనూ మ్యూజిక్ డైరెక్టర్స్ చరణ్ కి అవకాశం ఇస్తున్నారట. తండ్రి మరణం తర్వాత బిజీ అయిన చరణ్ ఈ ఫేజ్ లో సింగర్ గా క్లిక్ అవ్వడం ఖాయమనిపిస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates