Movie News

మాట నిలబెట్టుకున్న ఎఫ్3

ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రమోషన్లలో తమ సినిమా ఓటిటిలో త్వరగా రాదని నిర్మాతలు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నా వాస్తవానికి పరిస్థితి ఇంకోలా ఉంది. హిట్ అనిపించుకున్న మేజర్ సరిగ్గా నెలకే నెట్ ఫ్లిక్స్ లో పెట్టేశారు. ముప్పై అయిదు రోజులకు బ్లాక్ బస్టర్ విక్రమ్ ని హాట్ స్టార్ ఇచ్చేస్తోంది. విరాట పర్వం ఎంత డిజాస్టర్ అయినా మరీ అన్యాయంగా రెండు వారాలకే స్మార్ట్ స్క్రీన్ కు తెచ్చేశారు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లు ఫిఫ్టీ డేస్ తర్వాత దర్శనమిచ్చాయి. ఇవి అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీస్ కావడం వల్ల అంత గ్యాప్ సహజం.

కానీ ఎఫ్3 లాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్ ఆలస్యంగా డిజిటల్ బాట పట్టడం ఆశ్చర్యకరం. జూలై 22న సోనీ లివ్ లో ఇది అందుబాటులోకి రానుంది. దిల్ రాజు చెప్పినట్టే రెండు నెలలకు దగ్గరలో చిన్ని తెరకు విడుదల చేస్తున్నారు. గతంలో ఈయన బ్యానర్ లో వచ్చిన చాలా సినిమాలు నెల రోజులకే ప్రైమ్ లో వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఎఫ్3కి మాత్రం రూటు మార్చారు. మాములుగా ప్రైమ్ లోనే రాజుగారి హిట్లు ఫ్లాపులు ఎక్కువగా ఉన్నాయి. భారీ మొత్తానికే సోనీ లివ్ తో మొదటిసారి టై అప్ పెట్టుకున్నారు.

ఇది ఒకరకంగా మంచిదే. ఇటీవలే నిర్మాతల మండలి ఓటిటి విషయంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఎఫ్3 రావడం విశేషం. ఇది ముందు అగ్రిమెంట్ చేసుకున్నదే అయినా ఇకపై రాబోయే కొత్త సినిమాలు కూడా ఇదే రూట్ పడతాయా లేదానేది చూడాలి. ఎఫ్3 థియేటర్లలో బాగానే ఆడింది కాబట్టి ఇబ్బంది లేదు. అలా కాకుండా జనం తిరస్కరించిన వాటిని నెలల పాటు అట్టిపెట్టి ఆ తర్వాత ఓటిటిలో వేస్తే ఆడియన్స్ లో మిగిలిన కొద్దిపాటి ఆసక్తి కూడా చల్లారిపోవచ్చు. ఇంకొద్ది నెలలు ఆగితే ఈ పరిణామాల గురించి క్లారిటీ వస్తుంది.

This post was last modified on July 3, 2022 9:06 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

6 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

8 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

8 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

8 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

12 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

12 hours ago