థాంక్ యు చుట్టూ ప్యాన్ ఇండియాలు

నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన థాంక్ యు జూలై 8 నుంచి 25కి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ప్రమోషన్ కు తగినంత సమయం లేకపోవడంతో పాటు ఇంకొంచెం పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలన్స్ ఉండటంతో పోస్ట్ పోన్ తప్పలేదు. ఇప్పటికీ పూర్తి స్థాయి పబ్లిసిటీ మొదలుపెట్టలేదు.కేవలం లిరికల్ వీడియోలు మాత్రమే బయటికొచ్చాయి. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ రాలేదు కానీ మ్యూజిక్ లవర్స్ నుంచి ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గానే ఉంది. చేతిలో ఉన్న ఇరవై రోజుల సమయాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటారో మరి.

ఇదంతా ఓకే కానీ ఈ థాంక్ యు కు ముందు వెనుకా ప్యాన్ ఇండియా రిలీజులు ఉన్నాయి. అందులో మొదటిది అదే రోజు వస్తున్న కార్తికేయ 2. నిఖిల్ దీని మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. పోస్టర్లు గట్రా ఆసక్తి రేపుతున్నాయి. అనుపమ్ ఖేర్ లాంటి బాలీవుడ్ యాక్టర్ ఒప్పుకున్నాడంటే విషయమేదో బలంగానే ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడ్డ ఫాంటసీ జానర్ కాబట్టి తేలిగ్గా తీసుకోవడానికి లేదు. రన్బీర్ కపూర్ శంషేరాని తెలుగుతో సహా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దీని మీద ఇప్పటికైతే పెద్ద హైప్ లేదు.

ఆపై వారం గడవగానే ఈగ సుదీప్ విక్రాంత్ రోనా వస్తుంది. పూర్తి త్రీడి వెర్షన్ లో చాలా పెద్ద స్కేల్ మీద నిర్మించారు. హిందీతో సహా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అంటే మొత్తం మూడు ప్యాన్ ఇండియాల మధ్య సోలో లాంగ్వేజ్ తో థాంక్ యు పోరాడాల్సి ఉంటుంది. అవి విజువల్ గ్రాండియర్లు, చైతుదేమో సాఫ్ట్ ఎంటర్ టైనర్ కావడంతో ఓపెనింగ్స్ మీద వసూళ్ల మీద ప్రభావం ఉండొచ్చేమోననే అనుమానాలు ఫ్యాన్స్ కు లేకపోలేదు. గ్యాంగ్ లీడర్ డిజాస్టర్ తర్వాత విక్రమ్ కె కుమార్ కు థాంక్ యు హిట్ చాలా కీలకం.