ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా ది వారియర్ ట్రైలర్ యుట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో కళకళలాడిపోతోంది. యాక్షన్ కంటెంట్ తో మాస్ కి ఫుల్ మీల్స్ అనిపించేలా బాగానే కట్ చేశారు. టేకింగ్, విజువల్స్ ఓకే కానీ కథ పరంగా చూస్తే మాత్రం రెగ్యులర్ స్టైల్ లోనే ఉండటం అభిమానులను కొంచెం టెన్షన్ పెడుతోంది. ఓ పోలీస్ ఆఫీసర్, లోకల్ గూండా మధ్య జరిగే క్లాష్ ని దర్శకుడు లింగుస్వామి తన మార్కు టేకింగ్ తో తీసినట్టు ఉంది తప్ప ఎగ్జైట్ మెంట్ అనిపించేది అంతగా లేదనేది న్యూట్రల్ ఆడియన్స్ అభిప్రాయం.
ఏదో డాక్టర్ గెటప్ లో రామ్ కనిపించే ఒక షాట్ ని అలా చూపించి ఇలా మాయం చేశారు. ఇదేమైనా ట్విస్టా లేక పోలీసే ఏదో కారణంతో ఆ డ్రెస్సు వేశాడా అనేది చూడాల్సి ఉంది. ది వారియర్ కి మంచి బిజినెస్ జరుగుతోంది. రెడ్ ఫలితం ఎలా ఉన్నా ఇస్మార్ట్ శంకర్ రేంజ్ లో ట్రేడ్ దీని మీద నమ్మకం పెట్టుకుంది. లింగుస్వామి భారీ అంచనాలు అందుకోవాల్సి ఉంది. కొండారెడ్డి బురుజు దాని చుట్టూ రౌడీయిజంతో ఒక్కడు నుంచి సరిలేరు నీకెవ్వరు దాకా చాలా సినిమాలు వచ్చాయి. వారియర్ ఏం స్పెషలో చూడాలి.
అందుకే ఆది పినిశెట్టికి ఫ్యాక్షన్ బట్టలు వేయకుండా నల్ల దుస్తులతో కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, కృతి శెట్టి పాత్ర ఇవన్నీ రొటీన్ టెంప్లేట్ లోనే కనిపిస్తున్నాయి. అయితే క్రాక్ తరహాలో ఏదైనా షాకింగ్ ట్విస్టు, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటే మాత్రం ది వారియర్ కు పండగే. అసలే విక్రమ్ తర్వాత బాక్సాఫీస్ డల్ గా ఉంది. పక్కా కమర్షియల్ కూడా తేలిపోయింది. హ్యాపీ బర్త్ డే బాగున్నా బిసి సెంటర్స్ లో చేసే మేజిక్ అంతగా ఉండకపోవచ్చు. సో రామ్ కు మంచి స్లాట్ తో పాటు ఓపెన్ గ్రౌండ్ దొరుకుతోంది. పైగా చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేదు. బాగుందనే మాట వస్తే చాలు థియేటర్లకు జనం వస్తారు. మరి ఈ సీమ మసాలా వర్కౌట్ అయ్యేనా.
This post was last modified on July 2, 2022 4:33 pm
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…
అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. 30 ఏళ్ల కిందట తాను చేసిన శంకు స్థాపన తాలూకు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. ఇక మేకర్స్ అప్పుడప్పుడు ఓపెన్ గా మాట్లాడే…