పవర్ స్టార్ పవన్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో మరోసారి రుజువైంది. ఇంతకుముందు తన రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటుండగా.. ఎవరో దూరం నుంచి మొబైల్‌తో సరిగా కనిపించని విధంగా పవన్ ఫొటో తీస్తే అది సోషల్ మీడియాలో ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.
ఆ లీక్డ్ పిక్‌తోనే ఎన్నో అదిరిపోయే ఎడిట్స్ వచ్చాయి. చివరికి చిత్ర బృందం కూడా ప్రి లుక్‌లో ఆ ఫొటోనే వాడింది. అలాగే ‘వకీల్ సాబ్’కు సంబంధించి ఓ ఫైట్ సీక్వెన్స్ తాలూకు చిన్న వీడియో సైతం ఇలాగే వైరల్ అయింది. ఇప్పుడు ఆ చిత్రం నుంచి మరో ఫొటో వైరల్ అవుతోంది. ‘వకీల్ సాబ్’ ఒక కోర్ట్ రూం డ్రామా నేపథ్యంలో సినిమా అన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. కోర్టులో సీరియస్‌గా పవన్ వాదిస్తున్న లుక్కే తాజాగా బయటికి వచ్చింది.
అంతగా స్పష్టత లేని ఈ ఫొటోలో పవన్ బాగా సన్నబడి.. లైట్ గడ్డంతో కనిపిస్తున్నాడు. ఆయన వెనుక చాలామంది కూర్చున్నారు కానీ.. అందులో గుర్తుపట్టదగ్గ ఆర్టిస్ట్ అంటే అంజలినే. హిందీలో తాప్సి చేసిన కీలక పాత్రను తెలుగులో అంజలి చేస్తున్నట్లు ముందు నుంచి వార్తలొస్తున్నాయి. కానీ దాని గురించి అధికారికంగా ఏ సమాచారం లేదు.
ఈ మధ్య అంజలి పుట్టిన రోజుకు ఎస్వీసీ బేనర్ ట్వీట్ వేసినపుడు అంజలి ఈ సినిమాలో నటిస్తున్న మాట నిజమే అనిపించింది. ఇప్పుడు లీక్ అయిన ఫొటోతో స్పష్టత వచ్చేసింది. మరి హిందీలో అల్ట్రా మోడర్న్‌గా సాగిన తాప్సి పాత్రలో ట్రెడిషనల్ లుక్, ఇమేజ్ ఉన్న అంజలి ఏ మేర ఫిట్ అవుతుంది.. ఎలా మెప్పించి ఉంటుంది అన్నది ఆసక్తికరం.
ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి కరోనా బ్రేక్ వేసింది. ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభించినట్లు చెబుతున్నారు. వచ్చే సంక్రాంతికి ‘వకీల్ సాబ్’ ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంచనా.
This post was last modified on June 29, 2020 10:17 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…