ఆగస్ట్ లో రిలీజయ్యే సినిమాల అప్డేట్స్ అన్నీ వస్తున్నాయి కానీ ఆ నెల 12కి డేట్ లాక్ చేసుకున్న యశోద మాత్రం సైలెంట్ గా ఉంది. అంటే వాయిదా తప్పదనే క్లారిటీ వచ్చేసినట్టే. సమంతా ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకులు హరి – హరీష్. షూటింగ్ వేగంగానే చేసుకుంటూ వచ్చారు కానీ మధ్యలో ఏమయ్యిందో కానీ ఉన్నట్టుండి మౌనం వహించడంతో పోస్ట్ పోన్ చేసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇది ఒకరకంగా మంచి నిర్ణయమే అని చెప్పాలి.
ఆ వారంలో విపరీతమైన పోటీ నెలకొంది. లాల్ సింగ్ చద్దా, కోబ్రా, మాచర్ల నియోజకవర్గం, లాఠీలు క్యూ కట్టి ఉన్నాయి. ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ ని వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అలాంటప్పుడు యశోద కూడా దిగడం రిస్క్ అవుతుంది. అసలే ఆడియన్స్ థియేటర్లకు మునుపటిలా రావడం లేదు. ప్రతి శుక్రవారం డిస్ట్రిబ్యూటర్లకు హై టెన్షన్ బిపి వస్తోంది. పబ్లిక్ దేనికి వస్తారో దేనికి రారో అర్థం చేసుకోలేక కిందామీదా పడుతున్నారు. ఓటిటిలా టికెట్ రేట్లా వాళ్లే కన్ఫ్యూజ్ అయ్యే కారణాలతో సతమతమవుతున్నారు.
ఇలాంటి పరిస్థితిలో యశోద లాంటివి వీలైనంత సోలోగా రావడం బెటర్. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్, శత్రు, కల్పిక గణేష్ లాంటి పెద్ద క్యాస్టింగే ఉంది. థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ మూవీకి సంగీత దర్శకుడు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకం కానుంది. ఓ బేబీ తర్వాత సామ్ టైటిల్ రోల్ లో నటించిన సినిమా ఇదే. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా హిందీతో పాటు సౌత్ భాషలు అన్నింటిలోనూ డబ్బింగ్ చేస్తుండటంతో జాప్యం తప్పేలా లేదు.
This post was last modified on June 30, 2022 3:54 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…