వర్మ సినిమాల్లో క్వాలిటీ అనే మాట అదృశ్యమై చాలా ఏళ్లు దాటింది. కేవలం వివాదాస్పద అంశాల ఆధారంగా సినిమాలు తీస్తూ.. పబ్లిసిటీ గిమ్మిక్కులతో వాటిని సేల్ చేసుకుంటూ బండి నడిపిస్తున్నాడు వర్మ. ఆయన ఓ చెత్త సినిమా తీస్తే దాన్ని చూసి విపరీతంగా తిట్టుకునే జనాలు.. మళ్లీ ఏదో గిమ్మిక్కు చేసి తన తర్వాతి సినిమాతో అట్రాక్ట్ చేస్తే అటు వైపు చూస్తుంటారు.
ఇలా జనాల బలహీనత ఆధారంగానే ఆయన సినిమాలు నడుస్తున్నాయి. ‘క్లైమాక్స్’, ‘నేక్డ్’ అనే నాసిరకం బూతు సినిమాలకు కూడా కోట్లల్లో డబ్బులు వస్తున్నాయంటే ఏమనాలి? ఐతే అలా అని వర్మ ప్రతి సినిమాకూ కూడా డబ్బులు వచ్చేయట్లేదు. ఈ ఏడాది ఆరంభంలో ‘బ్యూటిఫుల్’ అనే సినిమాను వర్మ రిలీజ్ చేస్తే దానికి చిల్లర కూడా రాలేదు. ఆ సినిమాకు వర్మ పబ్లిసిటీ గిమ్మిక్కులేవీ పని చేయలేదు.
‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విషయంలోనూ రిలీజ్ ముంగిట వివాదం వల్ల కొంత హడావుడి నడిచింది కానీ.. తెరపై బొమ్మ పడ్డాక దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. వర్మ తన సినిమాల విషయంలో కోరుకునేది కాంట్రవర్శీ, తద్వారా వచ్చే పబ్లిసిటీ.
‘అమ్మరాజ్యంలో..’ సినిమాలో ఏవైనా పాత్రల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, గొడవ చేస్తే బాగుండని వర్మ కోరుకుని ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. అలా జరగలేదు కాబట్టే సినిమా అడ్రస్ లేకుండా పోయింది. మామూలుగా ఆవేశపరులుగా ముద్ర పడ్డ పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఆ సినిమాలో తమ హీరో పాత్ర గురించి అసలు చప్పుడు చేయలేదు. వాళ్లు కనుక ఆ పాత్ర విషయంలో గొడవ చేసి ఉంటే కథ వేరుగా ఉండేది.
మరీ చీప్ సినిమాల స్థాయికి పడిపోయిన వర్మను.. దెబ్బ తీయడానికి ఏకైక మార్గం ఆయన్ని ‘ఇగ్నోర్’ చేయడం. మొదట్లో పవన్‌ను వర్మ టార్గెట్ చేస్తుంటే ఆయన మీద పడిపోయేవాళ్లు అభిమానులు. తద్వారా వర్మ లక్ష్యం బాగానే నెరవేరేది. ఐతే వర్మను ఎంతగా ఇగ్నోర్ చేస్తే అంతగా ఆయన్ని శిక్షించినట్లే అని ఆలస్యంగా అర్థం చేుసుకున్న పవన్ అభిమానులు.. ఇప్పుడు పరిణతితో వ్యవహరిస్తున్నారు.
వర్మ తాజాగా ప్రకటించిన ‘పవర్ స్టార్’ సినిమా గురించి వాళ్లెవ్వరూ స్పందించడం లేదు. దాని గురించి ఎంత చర్చిస్తే అంతగా వర్మకు ప్రయోజనం చేకూరుతుందని వాళ్లకు అర్థమైనట్లే ఉంది. ఇదే వ్యూహాన్ని మున్ముందు కొనసాగిస్తే.. ‘పవర్ స్టార్’ సినిమా ఇలా వచ్చి అలా చరిత్రలో కలిసిపోవడం ఖాయం.
This post was last modified on June 28, 2020 10:25 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…