మెగాస్టార్ చిరంజీవి, అలాగే ఆయన తనయుడు రామ్ చరణ్‌లతో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మంచి అనుబంధం ఉంది. సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చి షూటింగ్‌లో పాల్గొన్నా చిరు ఇంటి నుంచే అతడికి క్యారియర్ వెళ్తుంటుంది. అలాగే చిరు, చరణ్ ముంబయి వెళ్లారంటే సల్మాన్ ఆతిథ్యం స్వీకరిస్తుంటారు. ఈ బంధం చాలా ఏళ్ల ముందు నుంచే కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలోనే చిరు కొత్త సినిమా గాడ్ ఫాదర్‌లో ఓ క్యామియో రోల్ చేయడానికి సల్మాన్ అంగీకరించాడు. చిరు, సల్మాన్‌ల మీద ఓ పాట కూడా చిత్రీకరించడం తెలిసిన సంగతే. సల్మాన్ స్థాయి హీరో ఇలా ఓ తెలుగు సినిమాలో క్యామియో రోల్ చేయడం విశేషమే. ఐతే ఇందుకోసం సల్మాన్‌కు పారితోషకం ఎంతమాత్రం ఇచ్చారో ఏమో తెలియదు. చిరు మీద ఉన్న అభిమానంతో సల్మాన్ ఉచితంగా నటించి ఉన్నా ఆశ్చర్యం లేదు.
ఐతే డబ్బుల సంగతి పక్కన పెడితే.. సల్మాన్ చేసిన సాయానికి చిరు కుటుంబం వెంటనే రుణం తీర్చుకుంటోందన్నది తాజా సమాచారం. సల్మాన్ కొత్త చిత్రం కభీ ఈద్ కభీ దివాలిలో చరణ్ మెరవబోతున్నాడట. ఇందులో ఒక పాటలో సల్మాన్‌తో కలిసి చరణ్ స్టెప్పులేయబోతున్నట్లు బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేస్తోంది. దీని గురించి కొంచెం గట్టిగానే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్త నిజమే కావచ్చు.
హిందీలో జంజీర్‌తో ఒకప్పుడు చేదు అనుభవం ఎదుర్కొన్న చరణ్.. ఇటీవల ఆర్ఆర్ఆర్‌తో అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తిరుగులేని పాపులారిటీ సంపాదించాడు. ఉత్తరాది జనాలు ఇప్పుడు అతడి పేరు చెబితే ఊగిపోతున్నారు. నార్త్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అతను.. సల్మాన్ సినిమాలో క్యామియో చేస్తే ఆ చిత్రానికి బాగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.