నక్సలిజం నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి గతంలో. కృష్ణవంశీ ‘సింధూరం’ ఈ బ్యాక్‌డ్రాప్‌లో కల్ట్ మూవీగా నిలిచిపోయింది. ఐతే 2000 ముందు వరకు ఈ నేపథ్యంలో ఏ సినిమా వచ్చినా మంచి ఆదరణే ఉండేది. కానీ తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. నక్సలిజం ప్రభావం అంతకంతకూ తగ్గిపోయి.. ఆ కాన్సెప్టే మరుగున పడిపోయింది. దేశంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో నక్సలిజం ఉంది కానీ.. తెలుగు రాష్ట్రాల వరకైతే ఆ ప్రభావం చాలా తక్కువ. జనాలు ఈ కాన్సెప్ట్‌తోనే పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయారని చెప్పాలి.ఆ ప్రభావం సినిమాల మీదా పడుతోంది.
ఇప్పుడు సొసైటీలో అసలేమాత్రం చర్చనీయాంశం కాని ఈ కాన్సెప్ట్ మీద సినిమాలు తీస్తుంటే జనాలు ఏమాత్రం నచ్చక తిరస్కరిస్తుండటం గమనార్హం. కొన్ని వారాల కిందటే ‘ఆచార్య’ సినిమా వచ్చింది. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరో. ఆయన నక్సలైట్ పాత్రలోనే కనిపించాడు. చరణ్ సైతం కాసేపు ఆ పాత్రలో మెరిశాడు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో పెద్ద ఎపిసోడే ఉంటుంది ఈ చిత్రంలో. కానీ జనాలకు అది అస్సలు రుచించలేదు. ఇప్పుడు ‘విరాటపర్వం’ విషయంలోనూ జరిగింది అదే. ‘ఆచార్య’తో పోలిస్తే ఇది మెరుగైన సినిమానే అయినా.. పూర్తగా నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ సినిమాతో ఇప్పటి ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు.
ఒకప్పుడైతే నక్సలైట్ల గురించి రోజూ జనాలు పేపర్లు, టీవీల్లో చూసేవారు. వాళ్ల గురించి చర్చించుకునేవారు. నక్సల్స్ ప్రభావం చాలా ప్రాంతాల మీద నేరుగా ఉండేది. కానీ ఇప్పుడు అవేవీ లేకపోవడంతో ఈ తరం యువతకు నక్సలైట్ల విషయంలో ఎమోషనల్ కనెక్షన్ అన్నదే లేదు. అలాంటపుడు వాళ్ల మీద సినిమాలు తీస్తే వాళ్లకెలా రుచిస్తుంది? సామాజికంగా చూసినా.. నక్సలిజం అన్నది ఔట్ డేటెడ్ కాన్సెప్ట్. సినిమాల పరంగా చూసినా అదే భావన ఉంది ఇప్పటి జనాలకు. కాబట్టి టాలీవుడ్ ఇక ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టేయడం బెటరేమో.