మాములుగా కోలీవుడ్ లో అతి పెద్ద మార్కెట్ ఉన్న హీరోలు ఎవరంటే మొదట వినిపించే పేర్లు రెండు. ఒకటి అజిత్ తర్వాత విజయ్. రజనీకాంత్ ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు కానీ యూత్ ఫాలోయింగ్ విషయంలో ఆయనా ఈ మధ్య కొంత వెనుకబడి ఉన్నారు. అందుకే రికార్డులు ఏవైనా సరే ఈ ముగ్గురికి మాత్రమే సాధ్యమని తమిళనాడు మీడియా ప్రస్తావిస్తూనే ఉంటుంది. అసలు కమల్ హాసన్ ఈ లిస్టులో ఎప్పటి నుంచో లేరు. కారణం ఏళ్ళ తరబడి సరైన హిట్ లేక ఆయన్ను వెంటాడుతూ వచ్చిన ఫ్లాపులు డిజాస్టర్లు.
ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. విక్రమ్ వసూళ్లు అక్కడి ట్రేడ్ పండితుల మతులు పోగొడుతున్నాయి. ఇప్పటిదాకా చెక్కుచెదరకుండా ఉన్న బాహుబలి 2 రికార్డుని విక్రమ్ దాటేయడం చూసి వాళ్లకు నోట మాట రావడం లేదు.
దాని ఫుల్ రన్ షేర్ 150 కోట్లని కేవలం మూడో వారం అడుగుపెట్టే లోపలే విక్రమ్ లేపేయడం చూసి వామ్మో అంటున్నారు. బాహుబలి 2 వచ్చి ఐదేళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఏ తమిళ మూవీ దాన్ని దాటలేకపోయింది. ఎవరి వల్లా కాలేదు. లోకనాయకుడికి సరైన సబ్జెక్టు పడితే బాక్సాఫీస్ విశ్వరూపం ఏ స్థాయిలో ఉంటుందో ఇతర హీరోల అభిమానులు కళ్లారా చూస్తూ వాహ్ కమల్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇంకా ఫైనల్ రన్ చాలా దూరంలో ఉంది. తెలుగులో కొంత స్లో అయ్యింది కానీ కేరళలోనూ విక్రమ్ ప్రభంజనం జోరుగా ఉంది. దీని దెబ్బకే అరుణ్ విజయ్ లాంటి మీడియం రేంజ్ హీరో తమ సినిమాల రిలీజ్ ని వాయిదా వేసుకున్నారు. ధైర్యం చేసి వచ్చినవి కమల్ తాకిడిని తట్టుకోలేక అత్తెసరు వసూళ్లతో సర్దుకుంటున్నాయి.
ఇలాంటి విజయాలు కెరీర్ లో ఎన్నో చూసిన కమల్ ఎప్పుడూ లేనంత ఆనందంగా విక్రమ్ విషయంలో ఉన్నారు. ఆ సంతోషం తాలూకు కనిపించని తడిని ఆయన కళ్ళలో చూడొచ్చు. కెరీర్ అయిపోతోంది ఇంకెవరు తనని చూడరేమోననే అనుమానాలు లోకేష్ కనగరాజ్ అనే యువకుడు బద్దలుకొట్టడం అంటే మాటలా
This post was last modified on June 19, 2022 11:37 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…