ఆర్ఆర్ఆర్ వంద రోజులకు దగ్గరవుతోంది. థియేట్రికల్ రన్ పూర్తయిపోయింది. నెట్ ఫ్లిక్స్ పుణ్యమాని దేశవిదేశీయుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు. కాస్త బ్రేక్ దొరికితే ఔటింగ్ వెళ్లి తన పదో వివాహ వార్షికోత్సవం చేసుకుని వచ్చేశాడు. ఇది కాగానే గౌతమ్ తిన్ననూరి ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ ఉంటాడు. ఆపై లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్ అంటూ పేర్లు వినిపిస్తున్నాయి. ఎటొచ్చి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ స్థాయి స్పీడ్ లో లేడనే అసహనం అభిమానుల్లో పెరిగిపోతోంది.
ఇంతకీ కొరటాల శివ ఫైనల్ వెర్షన్ ని లాక్ చేశారో లేదో తెలియదు. మరోవైపు ఆచార్య నష్టాల పంచాయితీ ఇంకా ఒక కొలిక్కి రాలేదని అందుకే ఆ టెన్షన్లన్నీ అయ్యాకే సినిమా మొదలుపెట్టాలని శివ తారక్ లు నిర్ణయించుకున్నారట. దానికి ఇంకెన్ని రోజులు పడుతుందో అంతు చిక్కడం లేదని ఫ్యాన్స్ ఫిర్యాదు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత మూడేళ్ళ గ్యాప్ ని వేగంగా పూడ్చే విధంగా త్వరగా సినిమాలు చేయాలని వాళ్ళ డిమాండ్. కానీ యంగ్ టైగర్ కు పరిస్థితులు అనుకూలించక ఆలస్యం తప్పడం లేదు.
ఓటిటిలో ఆర్ఆర్ఆర్ వచ్చాక దాన్ని చూసిన ఫారినర్స్ అధిక శాతం క్రెడిట్ ని చరణ్ కి ఇవ్వడం గాయం మీద కారం చల్లినట్టు అవుతోంది. ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ రిలీజ్ టైం నుంచే ఆ ఫీలింగ్ వాళ్లలో ఉంది. కెజిఎఫ్ దర్శకుడితో జూనియర్ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక వాళ్ళ నిరుత్సాహం తగ్గింది కానీ ఇకపై క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇస్తే తప్ప శాంతించేలా లేరు. కొరటాల ఎప్పుడు మొదలుపెట్టినా 2023లోనే రిలీజ్ ఉంటుంది. నీల్ ది 2024లో ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఆపై నెక్స్ట్ ఎవరో ..
This post was last modified on June 18, 2022 10:17 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…