ఆచార్య డిజాస్టర్ తర్వాత విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా గాడ్ ఫాదర్. మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ గా రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ ని ఆగస్ట్ లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయని ఒక ప్రచారం జరిగింది కానీ ఇప్పుడా అవకాశం లేదని తేలిపోయింది. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్ ఐడల్ సింగింగ్ షో మెగా ఫినాలేకి ముఖ్య అతిధిగా వచ్చిన చిరంజీవి, అక్కడే జడ్డ్ గా ఉన్న సంగీత దర్శకుడు తమన్ లు ఇన్ డైరెక్ట్ గా దీనికి సంబంధించిన కొన్ని కీలకమైన క్లూలు ఇచ్చేశారు
అందులో మొదటిది యాంకర్ శ్రీరామ్ కు చిరు మూవీలో పాడే అవకాశం. ఆది కూడా గాడ్ ఫాదర్ లోనే. టైటిల్ కోసం పోటీ పడుతున్న ఒక లేడీ సింగర్ కు సైతం అందులోనే అప్పటికప్పుడు ఓపెన్ ఆఫర్ ఇప్పించేశారు. చిరంజీవి నయనతార ఇందులో అన్నాచెల్లెలుగా నటిస్తున్నారని వీళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సాంగ్ ని ఆ అమ్మాయితో పాడిస్తామని తమన్ తో చెప్పించేశారు మెగాస్టార్. అంటే సాంగ్ రికార్డింగ్ జరగలేదన్న మాట. దాని తాలూకు షూట్ పెండింగ్ ఉంది. సో నయన్ వచ్చేదాకా బ్రేక్ పడినట్టే.
సాధారణ ప్రేక్షకుల్లో చాలా మంది లూసిఫర్ చూడలేదు. దీంతో చిరు నయన్ పాత్రల గురించి అవగాహన లేదు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్న బంధం ఏంటో ఓపెన్ గా చెప్పేశారు కాబట్టి డౌట్ తీరిపోయింది. ఒరిజినల్ వెర్షన్ లో ఈ క్యారెక్టర్ మంజు వారియర్ పోషించారు. సత్యదేవ్ నయనతార భర్తగా నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తారు. దీన్ని అక్కడ చేసింది వివేక్ ఒబెరాయ్. సో గాడ్ ఫాదర్ వర్క్ చాలా బ్యాలన్స్ ఉంది. అసలైన చిరు సల్మాన్ ఖాన్ కాంబో సాంగ్ కూడా ఇంకా పిక్చరైజ్ చేయలేదు. సో దసరా వరకు వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on June 18, 2022 9:47 am
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…