బాక్సాఫీసు కొంత చల్లగా ఉంది. ఎఫ్3 తర్వాత కుటుంబాలు సందడి చేసేంత సినిమా ఏదీ రాలేదు. అంటే సుందరానికి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా అది వసూళ్ల రూపంలో మారలేదు. ఫలితంగా నాలుగో రోజు మొదలైన డ్రాప్స్ మళ్ళీ ఎక్కడా బలంగా పికప్ కాలేదు.
ఈ వారం వచ్చిన విరాట పర్వంకి విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి కానీ కామన్ ఆడియన్స్ ని ఏ మేరకు థియేటర్లకు రప్పిస్తుందన్న అనుమానాలు వాళ్ళకే ఉన్నాయి. సత్యదేవ్ గాడ్సే సోసో రిపోర్ట్స్ తెచ్చుకుంది కాబట్టి ఈ వీక్ డ్రైగానే గడిచిపోనుంది.
ఇక వచ్చే వారం ఏకంగా తొమ్మిది సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో అంతో ఇంతో కాస్త ఎక్కువ బజ్ ఉన్నది సమ్మతమే. ఎస్ఆర్ కళ్యాణమండపం సూపర్ హిట్ తో యూత్ హీరోల లీగ్ లో చేరిపోయిన కిరణ్ అబ్బవరం ఇంకో పెద్ద బ్రేక్ పడితే స్టార్ రేస్ లో ఉండొచ్చనే అంచనాలో ఉన్నాడు. దానికి సమ్మతమే ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. అసలే సెబాస్టియన్ దారుణంగా దెబ్బేసింది. మినిమమ్ బ్రేక్ ఈవెన్ అవుతుందనే నమ్మకాన్ని కాలదన్ని మరీ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. దీనికి పోటీగా చెప్పుకోదగ్గ పోటీ ఆకాష్ పూరి చోర్ బజార్ ఒకటే. అది మాస్ జానర్ కాబట్టి సమ్మతమే టీమ్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు తిరిగి కిరణ్ కంబ్యాక్ అవ్వాలంటే సమ్మతమే డీసెంట్ హిట్ కొట్టడం చాలా అవసరం. నెక్స్ట్ వచ్చే వాటిలో నేను మీకు బాగా కావాల్సిన వాడినికి దర్శకుడు మారాడు. ముందు తీసుకుని సగం దాకా షూటింగ్ చేసిన మలయాళ దర్శకుడు కార్తీక్ శంకర్ ని తప్పించి ఎస్ఆర్ ఫేమ్ శ్రీధర్ గాదెకి ఆ బాధ్యతలు అప్పగించారు.
తర్వాత వినరో భాగ్యము విష్ణు కథ, మైత్రి నిర్మిస్తున్న మూవీ, రూల్స్ రంజన్ ఇలా వరస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నాడు. కౌంట్ కంటే క్వాలిటీకి ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో కిరణ్ ఇన్నేసి సినిమాలు ఒకేసారి చేయడం ఒక కోణంలో చూస్తే రిస్కే. సమ్మతమే లాంటివి అంతోఇంతో ఆడితే తన మార్కెట్ కే హెల్ప్ అవుతుంది.