అర్జున్ కపూర్-మలైకా అరోరా.. బాలీవుడ్లో ఇదో విచిత్రమైన ప్రేమ జంట. అర్జున్ వయసు 34 ఏళ్లు కాగా మలైకా వయసు 46 ఏళ్లు. తమ కంటే ఎక్కువ వయసున్న వారితో అబ్బాయిలు ప్రేమలో పడొచ్చు కానీ.. ఇక్కడ అంతరం మరీ 12 ఏళ్లుండటం.. మలైకాకు అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉండటంతో వీరి మధ్య ప్రేమేంటో చాలామందికి అంతు బట్టలేదు.
ఇంతకుముందు మలైకాతో బంధాన్ని దాచి పెట్టాలని చూసిన అర్జున్, మలైకా.. ఈ మధ్య మాత్రం ఓపెన్ అయిపోతున్నారు. కొన్ని రోజుల కిందటే ఓ ఇంటర్వ్యూలో మలైకాను తాను అంతగా ఇష్టపడటానికి కారణమేంటో వివరించాడు. మలైకాకు ఓపిక చాలా ఎక్కువ అని.. తన పట్ల ఆమె చాలా ఓపికతో వ్యవహరిస్తూ చక్కగా మేనేజ్ చేస్తుందని అర్జున్ తెలిపాడు.
ఇప్పుడు మలైకా శుక్రవారం అర్జున్ కపూర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ స్పెషల్ మెసేజ్‌తో అతడిని విష్ చేసింది. అర్జున్‌పై తన ప్రేమను చాటుకుంది. అర్జున్ కపూర్ క్యూట్ ఫొటో ఒకటి పెట్టి.. హ్యాపీ బర్త్ డే మై సన్‌షైన్ అనే వ్యాఖ్య జోడించింది మలైకా.
దీంతో పాటు అర్జున్‌తో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న సంయుక్త అనే మరో అమ్మాయితో అతను కలిసున్న ఫొటోను కూడా మలైకా షేర్ చేసింది. అర్జున్‌కు ఎంతోమంది పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు కానీ.. మలైకాతో అతడి బంధం దృష్ట్యా ఆమె ఎలా విష్ చేస్తుందా అని అంతా ఎదురు చూశారు. అర్జున్‌తో తన సన్‌షైన్‌గా పేర్కొనడం ద్వారా.. ఇప్పుడు అతనే తన జీవితానికి వెలుగు అని చెప్పకనే చెప్పింది మలైకా.
మలైకా.. సల్మాన్ సోదరుడు అర్బాజ్‌ను పెళ్లాడి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. వీళ్లిద్దరూ నాలుగేళ్ల కిందట విడిపోయారు. ఆ తర్వాతి నుంచి ఆమె అర్జున్‌తోనే సహజీవనం చేస్తోంది.
This post was last modified on June 27, 2020 2:32 pm
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని 'బర్చ్ బై రోమియో లేన్' అనే నైట్ క్లబ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…