పాన్ ఇండియా హీరో ప్రభాస్ , పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘సలార్’ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ‘కే.జీ.ఎఫ్ చాప్టర్ 2’ రిలీజ్ టైంలో ఆ సినిమాతో పాటు ఇంటర్వెల్ లో సలార్ గ్లిమ్స్ వీడియో ఎటాచ్ చేస్తారనే సోషల్ మీడియాలో గట్టిగా తిరిగింది. కానీ సలార్ మేకర్స్ అలాంటిదేమి ప్లాన్ చేయలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా నిరాశ పడ్డారు.
ఇప్పుడు జూన్ లోనే సలార్ టీజర్ అప్ డేట్ అంటూ మరో వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ‘రాధే శ్యామ్’ తో డిజప్పాయింట్ చేసిన ప్రభాస్ ‘సలార్’ తో సాలిడ్ హిట్ కొడతాడని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కేజీఎఫ్ చాప్టర్ 2 ని మించి సలార్ ఉంటుందని అంచనాలు పెట్టేసుకున్నారు కూడా. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసే టీజర్ ఎప్పుడు వస్తుందా ? అని వెయిట్ చేస్తున్నారు.
ఇక ఇటివలే ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు పార్టీలో ప్రభాస్ కనిపించాడు. తాజాగా సలార్ టీజర్ వీలైనంత త్వరగా రిలీజ్ చేయమని ప్రశాంత్ ని ప్రభాస్ స్వీట్ రిక్వెస్ట్ కూడా చేశాడని తెలుస్తుంది. ఫ్యాన్స్ ని ఎక్కువగా వెయిట్ చేయించకుండా సలార్ టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది లేదంటే ట్విట్టర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ హంబలే హ్యాండిల్ ని ట్యాగ్ చేస్తూ ఎటాక్ చేస్తూ ప్రెజర్ పెట్టడం ఖాయం.
This post was last modified on June 11, 2022 9:50 pm
దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా ఖైదీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతకు ముందు…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…