పుష్ప 2 ఎందుకు లేటవుతోంది?

దక్షిణాది కంటే ఉత్తరాదిలోనే భారీ విజయాన్ని అందుకున్న పుష్ప పార్ట్ 1 ది రైజ్ కి సీక్వెల్ ఇప్పటిదాకా మొదలుకాలేదు. గత డిసెంబర్ లో రిలీజైన మొదటి భాగం తర్వాత ఏకంగా ఆరు నెలలు గడిచిపోయాయి. స్క్రిప్ట్ పనుల కోసం దర్శకుడు సుకుమార్ ఆల్రెడీ ఒక విదేశీ ట్రిప్ కూడా పూర్తి చేశారు. మరోవైపు అల్లు అర్జున్ దీని కోసమే గెటప్ మార్చకుండా జుత్తు కత్తిరించకుండా సుక్కు కాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయంటున్నారు కానీ అవెంత వరకు వచ్చాయో సమాచారం లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం పుష్ప 2ని ఆగస్ట్ లో మొదలుపెట్టబోతున్నారు. క్రిస్మస్ విడుదలని ముందు అనుకున్నారు కానీ ప్రాక్టికల్ గా చూస్తే అది సాధ్యమయ్యే అవకాశాలు తగ్గడంతో హడావిడి పడకుండా ముందు షూట్ పూర్తి చేసి ఆ తర్వాత ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని గురించి ఆలోచిద్దామని, అప్పటిదాకా డేట్ గురించి టెన్షన్ అనవసరమనే కంక్లూజన్ కు వచ్చారట.

నార్త్ లో పుష్పని రిసీవ్ చేసుకున్న తీరుతో నెక్స్ట్ పార్ట్ మీద అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. వాటిని అందుకోవాలంటే చాలా కసరత్తే చేయాలి. ముందు సుకుమార్ పుష్ప 2ని స్టార్ట్ చేసే విషయంలో ఒక క్లారిటీకి వస్తే ఆపై ఆర్టిస్టుల కాల్ షీట్స్ ని సెట్ చేసుకోవాల్సిన పెద్ద బాధ్యత ఉంది.

రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ తదితరులు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండే ఆర్టిస్టులు కాదు. ఒక ప్లానింగ్ ప్రకారమే వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళ డేట్స్ ని లాక్ చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. లేదంటే మళ్ళీ వాయిదాల పర్వం తప్పదు. బాహుబలి 2, కెజిఎఫ్ 2 తరహాలో ఈ పుష్ప 2 కూడా ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.