లోకనాయకుడు కమల్ హాసన్ మీద తెలుగు ప్రేక్షకుల అభిమానం ప్రత్యేకమైంది. ఆయన్ని ఆదరించినట్లుగా మరే పర భాషా నటుడినీ మన వాళ్లు ఆదరించలేదు అంటే అతిశయోక్తి కాదు. భాషా సినిమా తర్వాత రజినీకాంత్‌కు తెలుగులో మాస్ ఫాలోయింగ్ పెరిగి ఆయన డబ్బింగ్ సినిమాలను గొప్పగా ఆదరించిన మాట వాస్తవమే కానీ.. ఆయన కంటే ముందు నేరుగా తెలుగులో మరో చరిత్ర, ఆకలి రాజ్యం, సాగర సంగమం, శుభసంకల్పం లాంటి ఆల్ టైం క్లాసిక్స్‌తో ఇక్కడి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన ఘనత కమల్ సొంతం.
అందుకే తెలుగు ప్రేక్షకుల గురించి ఎప్పుడు మాట్లాడినా చాలా ఎగ్జైట్ అవుతుంటారు కమల్. తన గురువు బాలచందర్‌తో సమానంగా మన దర్శక దిగ్గజం విశ్వనాథ్‌ను గౌరవించే ఆయన.. తెలుగు ప్రేక్షకుల అభిరుచి గురించి సందర్భం వచ్చినపుడల్లా ప్రస్తావిస్తూనే ఉంటారు. తెలుగు భాష మీద, సాహిత్యం మీద ప్రేమతో శ్రీశ్రీ కవితల్ని కంఠతా నేర్చుకున్న గొప్పదనం కమల్‌ది.
ఈ మధ్య కూడా ఓ తమిళ మ్యూజిక్ షోలో ఆయన శ్రీశ్రీ కవితల్ని వల్లె వేశారు. చాన్నాళ్ల తర్వాత ఆయన కొత్త సినిమా ‘విక్రమ్’ తెలుగులో పెద్ద ఎత్తున విడుదలైంది. అద్భుత స్పందన తెచ్చుకుంటోంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగానే కనిపించింది కానీ.. రిలీజ్ తర్వాత కథ మారిపోయింది. వసూళ్లు గొప్పగా పుంజుకున్నాయి. వీకెండ్లో హౌస్‌ఫుల్స్‌తో రన్ అయింది. వీకెండ్ తర్వాత కూడా సత్తా చాటుతోంది. ముందు ‘మేజర్’తో పోటీ అంటే కష్టమే అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఆ సినిమాకు దీటుగా, దాన్ని మించి తెలుగు రాష్ట్రాల్లో షేర్ రాబడుతోంది విక్రమ్. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కమల్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని కొనియాడారు. తనకు వాళ్లు ఎలాంటి విజయాలందించారో గుర్తు చేశారు. మంచి సినిమా తీస్తే వాళ్ల ఆదరణ మామూలుగా ఉండదన్నాడు.
ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన సుదాకర్ రెడ్డి సక్సెస్ గురించి మాట్లాడితే.. తాను మాత్రం మనం హిస్టరీ క్రియేట్ చేద్దాం అన్నానని.. హిస్టరీ అనే మాట చాలా పెద్దదని, అంత పెద్ద మాటను వాడే ధైర్యం తనకు తెలుగు ప్రేక్షకులే ఇచ్చారని.. అందుకే వారి అభిరుచి మీద నమ్మకంతో ఆ మాట అనగలిగానని.. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయి మళ్లీ తనను తెలుగు ప్రేక్షకుల దగ్గరికి తీసుకొస్తుందని ధీమాగా చెప్పారు కమల్. ఆ రోజు ఆయన అన్నట్లే ఇప్పుడీ సినిమా తెలుగులో బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. దీంతో కమల్ చెప్పి మరీ కొట్టాడంటూ ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.
This post was last modified on June 9, 2022 1:21 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…