బాలయ్య ‘డోంట్ కేర్’

2002లో విడుదలైన చెన్నకేశవరెడ్డి అంటే నందమూరి అభిమానులకు ప్రత్యేకమైన అభిమానం. దానికన్నా ముందే ఫ్యాక్షన్ సినిమాలు చేసినప్పటికీ ఇందులో ఉన్న స్టైల్, బాడీ లాంగ్వేజే తమ ఫెవరెట్ అని చెప్పుకుంటారు. అందులో మొదటి పాటే నవ్వే వాళ్ళు నవ్వని ఏడ్చే వాళ్ళు ఏడవని డోంట్ కేర్. చంద్రబోస్ సాహిత్యంతో మణిశర్మ స్వరపరిచిన ఈ సాంగ్ అప్పట్లో ఛార్ట్ బస్టర్.

ముఖ్యంగా బాలయ్య ముక్కుసూటితనాన్ని వర్ణించేలా అందులో లిరిక్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు నెమరేసుకుంటారు. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమాకు ‘బ్రో ఐ డోంట్ కేర్’ని టైటిల్ గా లాక్ చేసినట్టు సమాచారం.

అధికారికంగా రేపు రివీల్ చేసే అవకాశం ఉంది కానీ లీకైన సోర్స్ నుంచి విశ్వసనీయమైన అప్డేట్ రావడంతో సోషల్ మీడియాలో ఈ ట్యాగ్ హాట్ టాపిక్ గా మారింది. గతంలో బాలయ్యకు ఇంగ్లీష్ టైటిల్స్ చాలానే ఉన్నాయి. లెజెండ్, లయన్, డిక్టేటర్ ఇలా అన్ని తక్కువ అక్షరాలాతో ఉన్నవి. కానీ బ్రో ఐ డోంట్ కేర్ మాత్రం లెన్తీగా చాలా డిఫరెంట్ అన్న ఫీలింగ్ కలిగిస్తోంది.

రేపు అధికారికంగా చెప్పాక క్లారిటీ వస్తుంది కానీ మొత్తానికి వెరైటీగా ఆలోచించడంలో అనిల్ రావిపూడి మరోసారి తన మార్కు చూపిస్తున్నారు. ఎఫ్3 సక్సెస్ తర్వాత చేస్తున్న మూవీ అందులోనూ బాలయ్య లాంటి సీనియర్ ఊర మాస్ హీరోని డీల్ చేయడం ఇదే మొదటిసారి కావడంతో ఎలా చూపిస్తారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలయ్యింది. శ్రీలీల ఆయన కూతురిగా, ప్రియమణి భార్యగా నటిస్తుందనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమనేది వేచి చూడాలి. మరి డోంట్ కేర్ కే టీమ్ ఫిక్స్ అవుతుందా. చూద్దాం.