Movie News

సినీ ప్రియులకు పండగ వీకెండ్


సినిమాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన ఈ రోజుల్లో ప్రతివారం కొత్త చిత్రాలు థియేటర్లలోకి దిగుతూనే ఉంటాయి. కానీ వాటిలో ప్రేక్షకులను సంతృప్తి పరిచి వారిపై బలమైన ముద్ర వేసే చిత్రాలు అరుదే. ప్రేక్షకులను విందు భోజనంలా అనిపించి.. వారి మనసు నింపే సినిమాలు ఎప్పుడో కానీ రావు. ఒకే వీకెండ్లో మూణ్నాలుగు సినిమాలు రిలీజవడం, ఆ సినిమాలన్నీ కూడా తీవ్ర నిరాశకు గురి చేయడం.. లాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి ప్రేక్షకులకు.

ఒకే వారంలో రెండు సినిమాలు రిలీజై రెండూ పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాగా ఆడిన ఉదంతాలు ఈ మధ్య కాలంలో కనిపించవు. చివరగా 2020 సంక్రాంతికి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు అలా ఆడాయి. అందులో కూడా సరిలేరు నీకెవ్వరుకు కొంత డివైడ్ టాక్ వచ్చింది. అయినా సరే.. సంక్రాంతి టైమింగ్‌ను ఉపయోగించుకుని భారీ వసూళ్లు సాధించిందా చిత్రం. ఐతే మళ్లీ రెండు సినిమాలు మంచి టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుండటం ఇప్పుడే చూస్తున్నాం.

గత శుక్రవారం రిలీజైన మేజర్, విక్రమ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ‘మేజర్’ యునానమస్ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర అంచనాలను మించి సత్తా చాటుతుండగా.. ‘విక్రమ్’ తమిళంలో బ్లాక్‌బస్టర్ టాక్, ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి తెలుగులో కూడా డీసెంట్ టాక్, ఓపెనింగ్స్ వచ్చాయి. రివ్యూ అటు ఇటుగా ఉన్నప్పటికీ మౌత్ టాక్ మాత్రం చాలా బాగుంది. వసూళ్లు తొలి రోజు సాయంత్రానికి బాగా పుంజుకున్నాయి. శనివారం హౌస్‌ఫుల్స్‌తో నడిచింది ‘విక్రమ్’.

‘మేజర్’కు ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉండటం.. రివ్యూలు, టాక్ కూడా కలిసి రావడంతో ఆ సినిమా అదరగొడుతోంది. రెండు చిత్రాల్లో కంటెంట్ బలంగా ఉండడం, కథే ప్రధానంగా నడిచే సినిమాలు కావడంతో అభిరుచి ఉన్న ప్రేక్షకులకు రెండూ బాగా నచ్చుతున్నాయి. నిజమైన సినీ ప్రేమికులకు ఇది పండుగ లాంటి వీకెండ్ అనడంలో సందేహం లేదు. ఈ రెండు చిత్రాలూ దేశవ్యాప్తంగా సత్తా చాటుతుండటం శుభ పరిణామం.

This post was last modified on June 6, 2022 6:51 am

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

2 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

4 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

9 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

10 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

10 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

10 hours ago