భారీ అంచనాల మధ్య విడుదలైన విక్రమ్ రికార్డుల వేట మొదలయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో కొంత మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ ఈవెనింగ్ షోస్ నుంచి బుకింగ్స్ ఊపందుకున్నాయి. ఇక్కడ ఎలా ఉన్నా తమిళనాడులో మాత్రం పరిస్థితి వేరే లెవెల్ లో ఉంది. థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. రెండు మూడో రోజు కూడా తెల్లవారుఝామున నాలుగు గంటలకు వేస్తున్న షోలకు సైతం టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి. లోకనాయకుడి అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఆయన విశ్వరూపానికి వెర్రెక్కిపోతున్నారు.
విక్రమ్ ఫస్ట్ హాఫ్ లో కమల్ కనిపించేది తక్కువ సమయమే అయినా రెండో సగంలో దర్శకుడు లోకేష్ కనరరాజ్ ప్రెజెంట్ చేసిన తీరుకి అక్కడి ఆడియన్స్ ఫిదా అయ్యారు. యాక్షన్ ఎపిసోడ్స్ కి వస్తున్న అప్లాజ్ మాములుగా లేదు. ఇది కదా మా కమల్ చూడాలనుకున్న స్టైల్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ ట్వీట్లు పెడుతున్నారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్లను తీర్చిదిద్దిన వైనం, అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటా రెండా రిపీట్ రన్స్ కి ఇవే కారణాలుగా నిలుస్తున్నాయి.
తెలుగులోనూ రెస్పాన్స్ బాగుండటం చూస్తుంటే నితిన్ సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇది కనెక్ట్ అయ్యేది కాదు కానీ యూత్ అండ్ మాస్ అండదండలతో ఖైదీ తరహాలో ఈజీగా ప్రాఫిటబుల్ వెంచర్ అయ్యేలా ఉంది. సూర్య కనిపించేది కాసేపే అయినా ఆ కొద్దినిమిషాలు కూడా గూస్ బంప్స్ తో ప్రేక్షకులు ఎంజయ్ చేస్తున్నారు ఒక్క లెన్త్ విషయంలోనే కంప్లయింట్ ఉంది కానీ మిగిలిన అన్ని అంశాలల్లోనూ విక్రమ్ మూవీ ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచి వాళ్ళ గ్రాండ్ వెల్కమ్ అందుకున్నారు.
This post was last modified on June 3, 2022 7:35 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…