Movie News

రిలీజ్ డేట్ మళ్లీ మారింది.. మారుతూనే ఉంటుంది

టెనెట్.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా విడుదల కోసం చూస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ అనదగ్గ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. కరోనా ప్రభావం లేకుంటే ఎప్పుడో ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ రిలీజ్‌కు అంతా రెడీ చేసుకునే సమయానికి వైరస్ ప్రభావం మొదలై ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు షట్‌డౌన్ అయ్యాయి.

నోలన్ సినిమా ఎన్నో దేశాల్లో ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. వేల కోట్ల ఆదాయం వస్తుంది. కాబట్టి అన్ని దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎదురు చూడాల్సింది. అమెరికా సహా చాలా దేశాలు కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో జులై నెలాఖరుకు పరిస్థితులంతా చక్కబడతాయనుకుని ఆ నెల 31న ‘టెనెట్’ను రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. ఆ సినిమాతో వరల్డ్ సినిమా రీస్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు.

కానీ ఇండియా సహా చాలా దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇంకా కొన్ని నెలల పాటు పరిస్థితులు చక్కబడేలా లేవు. దీంతో ‘టెనెట్’ రిలీజ్‌ డేట్‌ను మరోసారి మార్చక తప్పలేదు. జులై 31 నుంచి ఆగస్టు 12కు కొత్త డేట్ ఇచ్చారు. కానీ ఆ కొన్ని రోజుల్లో పరిస్థితులు చక్కబడతాయని ఎవరూ అనుకోవడం లేదు. మరోసారి డేట్ మార్చడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

నోలన్ సినిమాలకు వందల కోట్ల ఆదాయం వచ్చే చాలా దేశాల్లో కనీసం ఇంకో మూడు నెలలు థియేటర్లు పున:ప్రారంభం అయ్యే పరిస్థితి లేదు. ఆ తర్వాత థియేటర్లు తెరుచుకున్న సాధారణ స్థాయిలో నడవకపోవచ్చు. కాబట్టి ఈ ఏడాది ‘టెనెట్’ సినిమాను రిలీజ్ చేయకపోవడం మంచిదని.. వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేయడం బెటర్ అని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి నోలన్ టీం ఆ నిర్ణయానికే వచ్చినా ఆశ్చర్యం లేదేమో.

This post was last modified on June 26, 2020 3:17 pm

Share

Recent Posts

మూడు సర్‌ప్రైజులు ఇవ్వనున్న కాకా ?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…

2 minutes ago

నక్క తోక తొక్కిన కామెడీ నక్సలైట్

మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…

1 hour ago

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

2 hours ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

2 hours ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

3 hours ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

3 hours ago