నిర్మాణంలోనే విపరీతమైన ఆలస్యం జరిగి వాయిదాల మీద వాయిదాలుతో ఫైనల్ గా ఈ నెల 17న వస్తున్న విరాట పర్వం మీద ఉండాల్సినంత హైప్ ఇంకా రాలేదన్న లేదన్న మాట వాస్తవం. ప్రమోషన్లు మొదలుపెట్టినప్పటికీ సోషల్ మీడియాలో కనిపించాల్సిన హడావిడి మొదలుకాలేదు. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్ ఉన్నా కదలిక తక్కువగా ఉంది.
పోస్టర్లు లిరికల్ వీడియోలు అంటూ చిన్నగా స్టార్ట్ చేసినప్పటికీ చేతిలో ఇంకో రెండు వారాలు మాత్రమే ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. అసలే ఇది నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడిక్ మూవీ. జనాలకు ఈ మధ్య ఈ కాన్సెప్ట్ అట్టే ఎక్కడం లేదు. ఆచార్యలో చిరంజీవి చరణ్ లు కలిసి చేసిన ఈ ఎపిసోడే పెద్ద మైనస్ అయ్యింది.
కమర్షియల్ ఫ్లేవర్ అద్దితేనే అలా ఉంది. కార్తికేయ రాజా విక్రమార్కలోనూ ఇదే తేడా కొట్టింది. కానీ విరాట పర్వం అలా కాదు. థీమ్ కు కట్టుబడి నిజాయితీగా సాగే మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ మూవీ. ఇంత సీరియస్ ఇంటెన్స్ డ్రామాని సామాన్య ప్రేక్షకులు, మాస్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎన్నో ప్రశ్నలను రేపుతోంది.
దర్శకుడు వేణు ఊడుగుల చేసింది ఒకే సినిమా. నీది నాది ఒకే కథ విమర్శకుల ప్రశంసలతో పాటు హిట్ స్టేటస్ అందుకుంది కానీ కమర్షియల్ గా ఎలాంటి అద్భుతాలు చేయలేకపోయింది. కనీసం అందులో యూత్ ని ఆకట్టుకునే పాయింట్ ఉంది. కానీ విరాట పర్వం చాలా సవాళ్ళను ఎదురుకోవాల్సి ఉంటుంది. డ్రైగా అనిపించే నక్సలిజం కాన్సెప్ట్ అందరూ కలిసి చూడొచ్చనేలా ప్రమోషన్ల వేగం పెంచాలి. ముఖ్యంగా రానా సాయిపల్లవిల కాంబినేషన్ ని ఎంత స్ట్రాంగ్ గా తీసుకెళ్లగలిగితే ఓపెనింగ్స్ కి అంత ప్లస్ అవుతుంది.