‘ఆచార్య’ సినిమా కోసం చాలా టైం తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి చకచకా సినిమాలు ఒప్పేసుకున్నారు. ఆయన ఓకే చేసిన నాలుగు సినిమాల్లో వెంకీ కుడుముల సినిమా కూడా ఒకటి. ఛలో, భీష్మ చిత్రాలతో ఘన విజయాలందుకున్న ఈ యువ దర్శకుడు మెగాస్టార్‌కు పెద్ద ఫ్యాన్. ఆ అభిమానంతోనే ఒక కథ రెడీ చేసి చిరును కలవడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయి.
గత ఏడాదే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఐతే ‘ఆచార్య’ డిజాస్టర్ అయి ఆత్మరక్షణలో పడ్డ చిరు.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో అప్రమత్తం అయ్యారని, స్క్రిప్టు ద్గగర రాజీ పడట్లేదని, ఈ క్రమంలోనే వెంకీ కుడుముల స్క్రిప్టు సంతృప్తికరంగా రాకపోవడంతో ఆ చిత్రాన్ని క్యాన్సిల్ చేస్తున్నాడని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. దీని గురించి ఇటు చిరు సన్నిహిత వర్గాలు కానీ, వెంకీ వైపు నుంచి కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు.
దీంతో ఈ సినిమా విషయంలో చిరు ఫ్యాన్స్ గందరగోళంలో పడిపోయారు. ఐతే ఈ ప్రచారాన్ని నేరుగా ఖండించలేదు కానీ.. పరోక్షంగా ఈ రూమర్లకు చెక్ పెట్టేశాడు వెంకీ కుడుముల. కమల్ హాసన్ సినిమా ‘విక్రమ్’ ఈ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో లోకనాయకుడిని వెంకీ ఇంటర్వ్యూ చేశాడు. ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న నితిన్.. ‘భీష్మ’తో తనకు క్లోజ్ అయిన వెంకీతో ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు. ఈ సందర్భంగా చిరుతో వెంకీ చేయబోయే సినిమా ప్రస్తావన వచ్చింది. ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనకరాజ్ సైతం కమల్‌కు పెద్ద ఫ్యాన్.
ఒక అభిమాని అయితేనే తన హీరోను తెరపై ఎలా ప్రెజెంట్ చేయాలో తెలుస్తుందని చెబుతూ లోకేష్‌ను కొనియాడిన వెంకీ.. తాను కూడా చిరును ది బెస్ట్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పాడు. మద్యలో కమల్ జోక్యం చేసుకుని.. కేవలం అభిమాని అయితే సరిపోదని.. తమ ఫేవరెట్ హీరో ఫిల్మోగ్రఫీ అంతా చూసి వాళ్లకు అత్యధికంగా పేరు తెచ్చిన సినిమా ఏదో చూడాలని.. చిరును బాలచందర్ ఆర్ట్ తరహా సినిమాలో అద్భుతంగా చూపించారని, అలాగే రాఘవేంద్రరావు కమర్షియల్ సినిమాల్లో గొప్పగా ప్రెజెంట్ చేశారని.. ఈ రెండు తరహా చిత్రాలను బ్యాలెన్స్ చేస్తూ చిరుతో సినిమా తీయాలని అభిప్రాయపడ్డారు. కచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తానంటూ చిరుతో తన ప్రాజెక్ట్ పక్కా అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు వెంకీ.
This post was last modified on June 2, 2022 8:05 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…