ఒకప్పుడు ఏదైనా రీమేక్ సినిమా ప్రకటించినప్పుడు దాని ఒరిజినల్ వెర్షన్ చూసే సౌలభ్యం ఉండేది కాదు. ఉదాహరణకు 1992లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ఘరానా మొగుడు లీడర్ మాతృక ఫలానా రజని మూవీ మన్నన్ అని తెలిసినా కూడా వినడమే తప్ప దాని గురించి కనీస సమాచారం దొరికేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. టెక్నాలజి పుణ్యమాని బాషతో సంబంధం లేకుండా అనౌన్స్ మెంట్ వస్తే చాలు ఓటిటిలు ఓపెన్ చేయడం లేదా ఎక్కడ దొరుకుతుందో ఆన్ లైన్ లో వెతికి పట్టుకోవడం జనాలు అలవాటుగా మార్చేసుకున్నారు.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటారా. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దానికి మీడియాలో విస్తృత ప్రచారం దక్కుతోంది. ఎప్పుడో 1994లో వచ్చిన హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి ఇది రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిపోవడంతో అందులో ఏముందో చూద్దామని అమీర్ ఫ్యాన్స్ తో పాటు నాగ చైతన్య అభిమానులు దాన్ని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో నిక్షేపంగా అందుబాటులో ఉంది. దాంతో ఆలస్యం చేయకుండా లుక్కేస్తున్నారు. ఒకవేళ లాల్ సింగ్ చడ్డా లేకపోతే ఈ ఫారెస్ట్ గంప్ మీద పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు కానీ రీమేక్ వల్ల 28 ఏళ్ళ క్రితం వచ్చిన కల్ట్ క్లాసిక్ ని వెతికి మరీ చూస్తున్నారు.
ముఖ్యంగా చైతు అభిమానులు తమ హీరో పాత్ర తాలూకు తీరుతెన్నులు, స్క్రీన్ టైం ఎంత, ఎలాంటి మలుపులు ఉంటాయనే దాని మీద ఆసక్తి చూపిస్తున్నారు. సబ్ టైటిల్స్ అందుబటులో ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోవడం ఈజీనే. ఎటొచ్చి ఇంగ్లీష్ రానివాళ్లు మాత్రం దీని జోలికి వెళ్లకుండా ఆగస్ట్ 11 సినిమా అసలు సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు
This post was last modified on June 2, 2022 9:08 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…