లోకేష్ కనగారాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో భారీ ఎత్తున జరిగింది. ఈవెంట్ కి వెంకటేష్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. అయితే ఫంక్షన్ లో ఈ ఇద్దరు కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ‘ఈనాడు’ ని గుర్తుచేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా కాకుండా ఎవరికీ తెలియని మరో సినిమాను గుర్తుచేశాడు కమల్.
మా ఇద్దరి కాంబినేషన్ లో ఈనాడు’ వచ్చింది. అందులో వెంకటేష్ చిన్న కేరెక్టర్ ప్లే చేశారు.
కానీ మా కాంబోలో ఇంకో సినిమా రావలసింది. ఆ సినిమా పేరు ‘మర్మయోగి’. వెంకటేష్ గెటప్ తో ఫోటో షూట్ కూడా చేశాం. ఆ ఫొటోస్ ఇప్పటికీ నా దగ్గరున్నాయి. ఆ ప్రాజెక్ట్ రెడీ టు షూట్ అనుకొని ఇంచులో మిస్సయింది అంటూ చెప్పుకొచ్చారు కమల్. ఒక టైంలో వెంకీ గోవాలో కలిసి తన కోసమే అక్కడికి వచ్చానని చెప్పడం సంతోషం కలిగించందని ఆ సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు.
అలాగే వెంకటేష్ ఒకసారి తన దగ్గరికొచ్చి నటుడిగా సక్సెస్ లు అందుకుంటున్నా కానీ ఇంకేదో చేయాలనుందని చెప్పి తనని సజీషన్ అడిగాడని ఆ సమయంలో తనకి ఏదో అనిపించింది చెప్పానని అన్నారు. ఆ తర్వాత నటుడిగా ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడని అదంతా తనకష్టమే అని తెలిపాడు.
వేదికలపై ఎక్కువ మాట్లాడకుండా నార్మల్ స్పీచ్ ఇచ్చే వెంకీ ఫర్ ఫస్ట్ టైం చాలా సేపు మాట్లాడాడు. కమల్ గొప్పదనం గురించి చెప్తూ ఆయన్ని పొగిడాడు.
ఇక హిందీలో కమల్ చేసిన సినిమాను ప్రస్తావిస్తూ తొలి పాన్ ఇండియా హీరో అతనే అంటూ చెప్పాడు. కమల్ కి తను పెద్ద అభిమాని అంటూ చెప్తూ ఆయనతో ఓ ఫుల్లెంగ్త్ సినిమా చేయాలనుందని అన్నాడు వెంకటేష్. ఏదేమైనా ఈనాడు తర్వాత ఈ కాంబోలో రావాల్సిన సినిమా క్యాన్సల్ అవ్వడం గురించి ఇద్దరూ ఈ వేదికపై కాస్త ఫీలయ్యారు. మళ్ళీ తప్పకుండా ఓ సినిమా చేస్తామని కమల్ గట్టిగా చెప్పారు. మరి చూడాలి కమల్ , వెంకీ కాంబోలో ఇంకో సినిమా ఎప్పుడొస్తుందో ?
This post was last modified on June 1, 2022 3:09 pm
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…