ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లలో ఫేవరెట్ ఎవరో మన స్టార్లు చెప్పుకునేవాళ్లు. అక్కడి స్టార్లు మన వాళ్లు గురించి మాట్లాడ్డం అరుదుగా ఉండేది. కానీ గత కొన్నేళ్లలో పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. బాలీవుడ్ సినిమాలు సౌత్‌లో ఆడడం సంగతలా ఉంచితే.. వాళ్ల మార్కెట్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. అదే సమయంలో సౌత్ సినిమాలు నార్త్ మార్కెట్‌ను కొల్లగొట్టేస్తున్నాయి. మన స్టార్లు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ ఫేమ్ తెచ్చుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇక్కడ తమ ఫేవరెట్ హీరోల గురించి బాలీవుడ్ స్టార్లు మాట్లాడే పరిస్థితి వచ్చింది. బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన రణబీర్ కపూర్ సైతం ఇప్పుడు మన స్టార్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న తన కొత్త చిత్రం బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో భాగంగా సోమవారం విశాఖపట్నానికి వచ్చాడు రణబీర్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడున్నపుడు.. టాలీవుడ్లో మీ ఫేవరెట్ ఎవరు అనే ప్రశ్న ఎదురైంది రణబీర్‌కు.
దీనికి సమాధానం ఇస్తూ.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. ఇలాంటి స్టార్లందరూ తనకు ఇష్టమని.. చిరంజీవి, కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి సౌత్ స్టార్లు తనకు ఇన్‌స్పిరేషన్ అని చెప్పాడు రణబీర్. అంతే కాక పవన్ కళ్యాణ్‌లోని స్వాగ్ తనకు ఇష్టమని అన్నాడు. ఇక తెలుగులో ఫేవరెట్‌గా ఒకే ఒక్క హీరోను ఎంచుకోమంటే ప్రభాస్ పేరు చెబుతానని అన్నాడు రణబీర్.
బ్రహ్మాస్త్రతో సౌత్‌లో బలమైన ముద్ర వేయాలనే ఆశతో ఉన్నాడు ఈ చాక్లెట్ బాయ్. కరణ్ జోహార్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ చిత్రంలో ఆలియా భట్ కథానాయికగా నటించింది. టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఇందులో ముఖ్య పాత్ర పోషించాడు. సెప్టెంబరు 9న బ్రహ్మాస్త్ర పార్ట్-1 రిలీజ్ కానుండగా.. ఈ నెల 15న ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు.
This post was last modified on May 31, 2022 10:49 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…