టాలీవుడ్ లో చాలా మంది వారసులు , వారసురాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది నెలదొక్కుకున్నారు ఇంకొంత మంది ట్రై చేసి పక్కకి తప్పుకున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల కూడా అప్పట్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంది. హీరోయిన్ అవ్వాలనే తన కోరికను తండ్రి ముందు పెట్టి ఆయన్ని ఎలాగోలా ఒప్పించింది మంజుల. దాంతో బాలకృష్ణ హీరోగా ఎస్ .వి.కృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘టాప్ హీరో’ సినిమాలో హీరాయింగా మంజుల కి అవకాశం వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ ఓపెనింగ్ ప్లాన్ చేశారు. బాలకృష్ణ , మంజుల మీద తొలి షాట్ క్లాప్ కి అంతా సిద్దమవుతుండగా కృష్ణ అభిమానులు లారీల్లో వివిధ వెహికిల్స్ లో వచ్చి మరీ విద్వంసం సృష్టించారు. మంజుల హీరోయిన్ అవ్వడానికి వీల్లేదని వాదించారు. దాంతో మొదటి సినిమా ఓపెనింగ్ రోజే మంజుల హీరోయిన్ ఎంట్రీకి శుభం కార్డు పడింది. తర్వాత మంజుల ప్లేస్ లో సౌందర్య ని హీరోయిన్ గా తీసుకొని షూటింగ్ మొదలు పెట్టారు. కొన్నేళ్ళ క్రితం జరిగిన ఈ ఇన్సిడెంట్ ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ.
కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మంజుల ఆయన్ను స్పెషల్ గా ఇంటర్వ్యూ చేసింది. తండ్రికి కొన్ని విషయాలు గుర్తుచేస్తూ మాట్లాడింది. అందులో భాగంగా నేను నటిగా సక్సెస్ అవ్వలేదని మీకు ఏమైనా భాద ఉందా ? నాన్న అని అడిగింది. “అప్పటి ఇన్సిడెంట్ గుర్తుచేసుకున్నారు కృష్ణ. “అప్పటికే స్టార్ హీరో అయిన బాలకృష్ణ పక్కన ‘టాప్ హీరో’ సినిమా చేయాల్సింది. కానీ అభిమానులు నిన్ను సిస్టర్ గా ఊహించుకునే వాళ్ళు. సడెన్ గా హీరోయిన్ అనేసరికి వాళ్ళు ఫీలయ్యారు. ఎస్ వి కృష్ణా రెడ్డి ఫ్లెక్సీలు చింపేసి పక్కన పడేసి గొడవ గొడవ చేశారు” అంటూ ఆ సంఘటన గుర్తుచేసుకున్నారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో సంజయ్ తో తన పెళ్లి గురించి కూడా కృష్ణ ని అడిగారు మంజుల. ఆ టైంలో మీ పెళ్లి మీ అమ్మకి ఇష్టం లేదు. కానీ నువ్వు అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకొని ఉంటావని నేను ఒప్పుకొని మీ నిశ్చితార్థం చేశాను. అప్పటికప్పుడు మన ప్రొడక్షన్ వాళ్ళే అన్ని ఏర్పాట్లు చేశారు అంటూ ఆ విషయం కూడా జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఈ ఇంటర్వ్యూ కృష్ణ అభిమానులకు అప్పటి రోజులను గుర్తుచేస్తూ సంతోషం కలిగిస్తుంది.