లెజెండ్ అని ఓ కొత్త తమిళ చిత్రం. ఈ సినిమా ఆడియో వేడుక ఆదివారం చెన్నైలో జరిగింది. ఆ వేడుకలో తమన్నా, హన్సిక సహా బోలెడంత మంది స్టార్ హీరోయిన్లు పాల్గొన్నారు. వీళ్లంతా ఆ సినిమాలో భాగమా అంటే అదేమీ కాదు. వాళ్లకు, ఆ సినిమాకు ఏ సంబందం లేదు. ఆ చిత్రంలో నటించింది పెద్ద స్టార్ హీరో ఏమో అందుకే వీళ్లంతా వచ్చారేమో అనుకుందామంటే అదీ లేదు. అతనో ఊరూ పేరు లేని హీరో. అయినా ఆ చిత్రానికి హ్యారిస్ జైరాజ్ లాంటి పెద్ద సంగీత దర్శకుడు, వేల్ రాజ్ లాంటి టాప్ సినిమాటోగ్రాఫర్, ఇంకా పెద్ద పెద్ద టెక్నీషియన్లు పని చేశారు.
ఆ చిత్రం మీద పదుల కోట్ల బడ్జెట్ కూడా పెట్టారు. చెన్నైలో కోట్లు పెట్టి ఈ సినిమా ఆడియో వేడుక నిర్వహించారు. ఇలాంటి హంగామా పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకు కూడా కనిపించదు. ఇంతకీ ఆ చిత్ర కథానాయకుడి పేరేంటో తెలుసా? లెజెండ్ శరవణన్. పేరు వెనుక ఆ లెజెండ్ ఏంటి.. ఎవరిచ్చారు ఆ బిరుదు అంటే.. ఎవ్వరూ ఇవ్వలేదు తనకు తనే పెట్టేసుకున్నాడు.
చెన్నైలో అతి పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఒకటైన శరవణ స్టోర్స్ అధినేతే ఈ లెజెండ్ శరవణన్. తన మాల్ ప్రమోషన్లకు ఏ స్టార్‌ను ఉపయోగించుకోకుండా తనే మోడల్‌గా మారి ప్రకటనలు చేస్తుంటాడీ లెజెండ్ శరవణన్. అతడి లుక్స్ చూస్తే కమెడియన్లకు కూడా తక్కువగా కనిపిస్తాడు. అయినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా స్టార్ హీరోయిన్లతో యాడ్స్‌లో హడావుడి చేస్తుంటాడు. ఐతే తన మాల్ యాడ్స్‌లో ఏం చేసినా చెల్లిపోతుంది కానీ.. ఈయన గారు ఇప్పుడు ‘లెజెండ్’ పేరుతో పెద్ద యాక్షన్ సినిమా చేస్తున్నాడు.
ఇది స్టార్ హీరోలు నటించే కమర్షియల్ సినిమాల తరహాలో భారీ కథతో, విపరీతమైన బిల్డప్పులతో, పెద్ద బడ్జెట్లో తెరకెక్కడమే విడ్డూరం. ఈ చిత్ర ట్రైలర్ చూస్తే ఇది ‘శివాజి’ని పోలిన చిత్రంలా కనిపిస్తోంది. ఇందులో శరవణన్ సైంటిస్టు పాత్ర పోషించాడు. సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులే నటించారు. తమిళ జనాల సంగతేమో కానీ.. ఈ ట్రైలర్ చూసి తెలుగు జనాలకు మాత్రం దిమ్మదిరిగిపోతోంది. ఇతను హీరో ఏంటి.. ఆ డ్యాన్సులేంటి, ఫైట్లేంటి, హీరోయిన్‌తో ఆ రొమాన్సేంటి.. ఆ బిల్డప్పులేంటి.. అని నివ్వెరపోతున్నారు. ఈ అతిని తమిళ జనాలు ఎలా భరిస్తున్నారో అర్థం కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు. ఇది మన ‘హృదయ కాలేయం’ లాగా సెటైరికల్ మూవీ కూడా కాదు.. ఇంకో యాంగిల్లో చూడటానికి. శరవణన్‌ను పెట్టి సీరియస్‌గా ఇంత పెద్ద స్థాయిలో సినిమా తీయడం, పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పని చేయడం, ఆడియో వేడుకకు ఇంత హంగామా చేయడం అన్నీ చూసి దిమ్మదిరిగిపోతోంది మన జనాలకు.
This post was last modified on May 31, 2022 7:39 am
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…