Movie News

విక్రమ్ కోసం ఈనాడు స్నేహితుడు

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న విక్రమ్ మీద తమిళనాడులో భారీ అంచనాలున్నాయి కానీ తెలుగులో మాత్రం చెప్పుకోదగ్గ బజ్ కనిపించడం లేదు. ఖైదీ లాగా టాక్ వస్తే తప్ప గట్టి పికప్ ఆశించలేం. కమల్ హాసన్ సినిమానే అయినప్పటికీ ఇక్కడాయనకు ఒకప్పటి మార్కెట్ లేదు. గత పదిహేనేళ్లు చూసుకుంటే దశావతారం, విశ్వరూపం 1లు మాత్రమే అంతోఇంతో కమర్షియల్ గా వర్కౌట్ చేసుకున్నాయి.

ఉత్తమవిలన్, విశ్వరూపం 2, చీకటి రాజ్యం తలుచుకోలేనంత దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అందుకే విక్రమ్ కోసం ప్రమోషన్ విషయంలో లోకనాయకుడే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రేపు హైదరాబాద్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. దీనికో కారణం ఉంది.

2009లో కమల్ నటించిన స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీ ఈనాడులో ఆయనతో వెంకీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇమేజ్ లెక్కలు వేసుకోకుండా ఒరిజినల్ వెర్షన్ లో అనుపమ్ ఖేర్ చేసిన క్యారెక్టర్ కు ఎస్ చెప్పారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఆ సినిమా ఆడలేదు కానీ వీళ్ళ స్నేహం అలాగే కొనసాగింది.

ఇప్పుడా ఈనాడు బంధంతోనే వెంకటేష్ రాబోతున్నారు. అలా అని ఈ రిలేషన్ షిప్ ఇక్కడికే పరిమితమని చెప్పలేం. కమల హాసన్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా చెప్పుకునే ఇంద్రుడు చంద్రుడు రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. అప్పటి నుంచే ఈ కుటుంబంతో స్నేహం కొనసాగుతోంది. ఎఫ్3 హిట్ తో మంచి జోష్ మీదున్న వెంకీ ఇప్పుడీ విక్రమ్ కు గెస్ట్ గా రావడం హెల్ప్ అయ్యేదే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ లు ఇతర తారాగణం 

This post was last modified on May 30, 2022 4:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ చేప రేటు 3.95 లక్షలు.. ఎందుకంటే…

కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్‌లో…

5 minutes ago

ఈసారి ‘అక్కినేని లెక్కలు’ మారబోతున్నాయా

ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…

6 minutes ago

ఆగని పూజా ఫ్లాప్ స్ట్రీక్…

అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్‌లతో తిరుగులేని క్రేజ్…

1 hour ago

ప్రజ్ఞానంద్ చెస్ మాస్టర్స్ ఛాంపియన్… గుకేశ్‌పై ఘన విజయం!

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.…

2 hours ago

సుపరిపాలన రూపశిల్పి చంద్రబాబే

1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…

3 hours ago

అంబానీ చేత చప్పట్లు కొట్టించిన కుర్రాడు…

ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…

3 hours ago