ఎప్పుడొస్తావు రామా – ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్

Adipurush
Adipurush

బాహుబలి వచ్చాక ప్రభాస్ ఇమేజ్ లో మార్కెట్ లో ఎంత సమూలమైన మార్పులు వచ్చాయో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్యాన్ ఇండియా నుంచి ప్యాన్ వరల్డ్ దాకా ఎదిగిపోతున్న డార్లింగ్ స్టార్ డం చూసి అభిమానులకు ఒకపక్క ఆనందంగా ఉన్నా ఇతర హీరోల్లా కనీసం ఏడాదికో సినిమా చేయలేని పరిస్థితికి లోలోపల బాధ పడుతున్న దాఖలాలు ఉన్నాయి. సరే ఆలస్యమైతే అయ్యాయి కనీసం వాటికి బజ్ తెచ్చే విషయంలో అయినా నిర్మాణ సంస్థలు యాక్టివ్ గా ఉండాలని ముందుం నుంచి వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఇదొక్కటే.

ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఆది పురుష్. 2023 సంక్రాంతి విడుదలగా ప్రచారం జరుగుతున్న ఈ విజువల్ గ్రాండియర్ కు సంబంధించి ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ కూడా వదల్లేదు. ఆ మధ్య శ్రీరామనవమికి దర్శకుడు ఓం రౌత్ ఫ్యాన్స్ వేసిన పెయింటింగ్స్ ని ఏదో గొప్ప అప్డేట్ లాగా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం బ్యాక్ ఫైర్ అయ్యింది. వందల కోట్లతో సినిమా తీస్తున్న దర్శకుడు చేయాల్సింది ఇలాగేనా అంటూ నెటిజెన్లు గట్టిగానే విరుచుకుపడ్డారు. దెబ్బకు ఓం రౌత్ మళ్ళీ మాట్లాడితే ఒట్టు.

ఒకవేళ నిజంగానే రిలీజ్ ఫిక్స్ చేసుకుంటే ఆది పురుష్ కు ఇప్పటి నుంచే మెల్లగా ప్రమోషన్లు మొదలుపెట్టడం అవసరం. నార్త్ లోనూ కేవలం ప్రభాస్ ఇమేజే భారీ వసూళ్లు తేలేదని రాధే శ్యామ్ ఫెయిల్యూర్ ఋజువు చేసింది. సో దేశంలో రాముడు సెంటిమెంట్ బలంగా ఉన్న పరిస్థితుల్లో మెల్లగా పబ్లిసిటీని స్టార్ట్ చేయాలి.

అసలు ప్రభాస్ రఘురాముడి గెటప్ లో ఎలా ఉంటాడనే ఉత్సుకతను వీలైనంత త్వరగా తీర్చడం మంచిది. లేదూ మీనమేషాలు లెక్కబెట్టుకుంటూ ఉంటామంటే మిగిలిన ప్యాన్ ఇండియాలు దూసుకెళ్తాయి