బ్లాక్‌బస్టర్ కొట్టిన డైరెక్టర్ గురించి పాపం అనడమేంటి అని ఆశ్చర్యం కలుగుతోందా? మరి కొత్త హీరో హీరోయిన్లను పెట్టి తీసిన లవ్ స్టోరీతో వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాక.. మూడేళ్లకు పైగా ఇంకో సినిమా తీయకుండా ఖాళీగా ఉంటే పాపం అనక ఇంకేమనాలి? ఈ చర్చ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా గురించే అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. అతడి తొలి సినిమా ఉప్పెన ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా మేకింగ్ దశలోనే చాలా ఆలస్యం అయింది. అనుకున్న దాని కంటే దాదాపు ఏడాది ఆలస్యంగా విడుదలైంది. ఆలస్యమైతే అయ్యింది కానీ.. సినిమా చాలా పెద్ద హిట్టయిందని సంబరపడితే.. ఆ తర్వాత రెండో సినిమా విషయంలో సుదీర్ఘ నిరీక్షణ తప్పేలా లేదు బుచ్చిబాబుకు.
ఉప్పెన తర్వాత అతడికి మంచి మంచి అవకాశాలే వచ్చాయి. ఐతే తన కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే సినిమానే చేయాలని, తనకు అప్పటికే మంచి అనుబంధం ఉన్న పెద్ద హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు కథ చెప్పాడు బుచ్చిబాబు. తారక్‌కు ఆ కథ నచ్చింది, సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు. బుచ్చిబాబు తొలి సినిమాను ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఓకే చెప్పింది. కానీ ఈ ప్రాజెక్టు ఎప్పుడన్నదే క్లారిటీ లేదు.
బుచ్చిబాబేమో స్క్రిప్టు రెడీ చేసుకుని టెక్నీషియన్ల ఎంపికలో పడ్డాడు. కానీ సినిమా వచ్చే రెండేళ్లలో మొదలయ్యే సూచనలే కనిపించడం లేదు. కొరటాల శివతో తారక్ సినిమా ఆలస్యం అవుతుండటం, ప్రశాంత్ నీల్ సినిమా మీదా క్లారిటీ లేకపోవడంతో బుచ్చిబాబు చిత్రం ముందు మొదలవుతుందేమో అన్న ప్రచారం కూడా జరిగింది ఓ దశలో. అలా కాకపోయినా.. కొరటాల సినిమా తర్వాత ఇదే ఉంటుందని కూడా అన్నారు. కానీ ఇప్పుడు అందుకు ఛాన్సే లేదని తేలిపోయింది.
తన తర్వాతి రెండు చిత్రాలనూ కొరటాల, ప్రశాంత్‌లతోనే చేయబోతున్నాడు తారక్. కాగా.. ఈ రెండు చిత్రాల తర్వాత తారక్ ఇమేజే మారిపోవచ్చని, అప్పుడు బుచ్చిబాబుతో సినిమా చేస్తాడో లేదో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినా తారక్‌తో సినిమా చాలా ఆలస్యం అయ్యేలా ఉన్న నేపథ్యంలో బుచ్చిబాబు.. ఈ కథనే పట్టుకుని ఉండటం కరెక్ట్ కాదని, వేరే చిత్రాల కోసం ప్రయత్నించడం మేలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
This post was last modified on May 22, 2022 7:48 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…