Movie News

లాల్ సింగ్ ని సవాల్ చేస్తున్న కోబ్రా

ఒకప్పుడు విక్రమ్ అంటే తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉండేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా అపరిచితుడు సాధించిన వసూళ్లు అప్పట్లో ట్రేడ్ ని సైతం నివ్వెరపరిచాయి. దీని పుణ్యమాని ఇతని బిలో యావరేజ్ సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ అందుకుని డిస్ట్రిబ్యూటర్లకు విక్రమ్ ని మినిమమ్ గ్యారెంటీ హీరోగా మార్చాయి. కానీ అదంతా గతం. ఎంత కష్టపడే తత్వం ఉన్నా సబ్జెక్టు సెలక్షన్లో వరుసగా చేసిన తప్పులకు విలువైన తెలుగు మార్కెట్ కోల్పోవడమనే భారీ మూల్యాన్ని విక్రమ్ చెల్లించాడు.

అందుకే ఇతని కొత్త సినిమా ఏదైనా వస్తోందంటే ప్రేక్షకుల్లో అంత ఎగ్జైట్ మెంట్ కనిపించడం లేదు. ఐ మాత్రమే శంకర్ డైరెక్షన్ అనే బ్రాండ్ తో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఇక అసలు విషయానికి వస్తే విక్రమ్ కోబ్రా విడుదల తేదీని ఆగస్ట్ 11 ప్రకటించారు. ఇది ఎప్పటి నుంచో షూటింగ్ లో ఉన్న మూవీ. అదిగో ఇదిగో అంటూ రిలీజ్ ని వాయిదా వేస్తూ ఎట్టకేలకు థియేటర్లకు తీసుకొస్తున్నారు. కరోనా టైంలో మంచి ఓటిటి ఆఫర్స్ వచ్చినప్పటికీ ఫైనల్ కాపీ సిద్ధంగా లేని కారణంగా వాటిని వదిలేసుకోవాల్సి వచ్చిందని చెన్నై టాక్.

అదే 11వ తేదీ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా భారీ ఎత్తున రాబోతోంది. అందులో నాగ చైతన్య ఒక ముఖ్యమైన క్యామియో చేశారు. తెలుగు తమిళంలో కూడా డబ్బింగ్ చేయబోతున్నారు. ఇన్ని అంచనాలు మోస్తున్న దీని మీద విక్రమ్ తన కోబ్రాతో పోటీకి దిగడం రిస్కే. పైగా తెలుగులో మరుసటి రోజు మాచర్ల నియోజకవర్గం, ఏజెంట్, యశోద లాంటి క్రేజీ లైనప్స్ ఉన్నాయి. అలాంటప్పుడు కోబ్రాని బరిలో దించడం వల్ల కలిగే ప్రయోజనం తక్కువ. ఈ సినిమాలో విక్రమ్ 20కి పైగా చిత్రవిచిత్రమైన గెటప్పులు వేయడం విశేషం.

This post was last modified on May 21, 2022 6:51 am

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

31 minutes ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

59 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

12 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

12 hours ago