ఆ సినిమా అప్డేట్ లేదేంటి ?

ఎన్టీఆర్ నెక్స్ట్ కొరటాల శివతో అలాగే ప్రశాంత్ నీల్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్స్ వచ్చేశాయి. ఎన్టీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకొని ఫ్యాన్స్ కి ఆ సినిమాల అప్ డేట్స్ పోస్టర్స్ తో అందింది. అయితే తారక్ లైనప్ లో ఉన్న బుచ్చిబాబు సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో అసలు ఈ కాంబో సినిమా ఉంటుందా లేదా ఇది జస్ట్ బజ్ వరకేనా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.

ఈ కాంబోలో సినిమా అయితే ఉంది. ‘ఉప్పెన’ రిలీజ్ అవ్వగానే ఎన్టీఆర్ కి లైన్ చెప్పి సినిమా లాక్ చేసుకున్నాడు బుచ్చిబాబు. రెండు మూడు నెరేషన్లు కూడా ఇచ్చాడు. ఫైనల్ నరేషన్ ఇవ్వాల్సి ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఓకె సెకండాఫ్ మీద బుచ్చి బాబు అండ్ టీం వర్క్ చేస్తుంది. క్లైమాక్స్ కూడా ఇంకా క్రాక్ అవ్వలేదు. ‘పెద్ది’ అనే టైటిల్ తో ఉత్తరాంద్ర నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ డ్రామా ఏదో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు.

ఫైనల్ నరేషన్ ఇంకా అవ్వలేదు పైగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నందుకే ఈ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేయలేదని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ రెండు సినిమాలు చేసే లోపు బుచ్చిబాబు ఫైనల్ నెరేషన్ ఇచ్చేసి తారక్ నుండి గ్రీన్ సిగ్నల్ అందుకుంటే #NTR32 గా సినిమా సెట్స్ పైకి వెళ్తోంది. ఈ లోపు ఓ మీడియం రేంజ్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు బుచ్చిబాబు.