మహేష్ ఫుల్ హ్యాపీ అదే నిదర్శనం

ప్రస్తుతం థియేటర్స్ రన్ అవుతున్న ‘సర్కారు వారి పాట’ గురించి దర్శకుడు పరశురాం కొన్ని సందేహాలకు ఆన్సర్ ఇచ్చాడు. నిజానికి ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అందులో మొదటిది తల్లిదండ్రులు లోన్ కట్టకుండా చనిపోతే మళ్ళీ హీరో పెద్దయ్యాక లోన్లు ఇస్తూ తీసుకున్న వారిని పీడించడం అనేది స్క్రిప్ట్ లో మేజర్ డ్రా బ్యాక్. అయితే దీని గురించి దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. “హీరో చిన్నప్పుడు అందరికంటే ఎవరు స్ట్రాంగ్ అని తండ్రిని అడగ్గా ఏ అప్పు లేనివాడు స్ట్రాంగ్ రా అప్పు ఇచ్చేవాడు ఇంకా స్ట్రాంగ్ అని చెప్తాడు ఆ మాట తన మైండ్ లో ఉండిపోతుంది. అందుకే అమెరికా వెళ్లి అక్కడ వడ్డీ వ్యాపారిగా ఎదుగాడు” అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఇక సెకండాఫ్ లో కీర్తి సన్నివేశాలు కాస్త ఎబ్బెట్టుగా ఉన్నాయి కదా అనే ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇచ్చారు పరశురాం. “హీరో హీరోయిన్ లో తల్లిని చూసుకున్నాడు అందుకే అలా కాలు వేసి పడుకోవడం సీన్స్ పెట్టాను. అందుకే ఆ సీన్స్ లో ఎక్కడా వల్గారిటీ పెట్టలేదు.” అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఇక తనకు వడ్డీ అందకపోతే తాట తీసి వసూళ్ళు చేసే హీరో సెకండాఫ్ లో మాత్రం వడ్డీలు కట్టొద్దని చెప్తూ రికవరీ కి వచ్చిన వాళ్ళని కొడతాడు కదా దీనికేం చెప్తారు అని అడగ్గా ” కోట్లు కట్టాల్సిన వాళ్ళని వదిలేసి వేల అప్పులు ఉండే మిడిల్ క్లాస్ వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు ఇది రాంగ్ వాళ్ళు కడితేనే మీరు కూడా కట్టాలి అంటూ చెప్పే ప్రయత్నంలో డబ్బులు కట్టొద్దు అంటాడే తప్ప అస్సలు కట్టొద్దని చెప్పడు” అంటూ చెప్పుకున్నాడు.

ఫైనల్ గా మహేష్ ఈ సినిమా విషయంలో హ్యాపీ యేనా? అనే ప్రశ్నకు స్టేజి మీదకి సడెన్ గా వచ్చి డాన్స్ వేయడమే ఆయన ఎంత హ్యాపీ గా ఉన్నారో అన్నదానికి నిదర్శనం అంటూ ఆన్సర్ ఇచ్చాడు పరశురాం. ఇలా మీడియా నుండి ఎదురైన అన్ని ప్రశ్నలకు సమాదానం ఇచ్చిన పరశురాం సెకండాఫ్ లో మహేష్ -కీర్తి సీన్స్ గురించి మాత్రం హీరోయిన్ లో అమ్మని చూసుకున్నాడు అంటూ సమర్దించుకునే ప్రయత్నం చేశాడు. ఏదేమైనా సర్కారు వారి పాట విషయంలో హీరో , దర్శకుడు, నిర్మాతలు అందరూ హ్యాపీగానే ఉన్నట్టున్నారు.