రెండేళ్ళు.. నాలుగు సినిమాలు

చిన్న గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్’ తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పటికే రెండు సినిమాలు కంప్లీట్ చేసేసి రిలీజ్ చేసేశాడు. రీ ఎంట్రీ ఇవ్వాలని పవన్ డిసైడ్ అవ్వడమే ఆలస్యం దర్శక, నిర్మాతలు అతన్ని చుట్టుముట్టి అరడజను సినిమాలు లాక్ చేయించారు. అందులో రెండు కంప్లీట్ అయ్యాయి. ఇంకా నాలుగు మిగిలున్నాయి. నిజానికి మొన్నటి వరకూ పవన్ నెక్స్ట్ లిస్టులో మూడు సినిమాలే ఉన్నాయి. ఇప్పుడు అనుకోకుండా ఇంకో రీమేక్ వచ్చి చేరింది.

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ సినిమా చేస్తున్న పవర్ స్టార్ ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా చేయాలి. ఆ తర్వాత సురేందర్ రెడ్డితో పవన్ సన్నిహితుడు రామ్ తాళ్ళూరి నిర్మాణంలో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ దర్శకుడు సముద్రఖనిని తీసుకెళ్ళి పవన్ కి ఓ తమిళ సినిమా చూపించాడు. ఆ సినిమానే ‘వినోదయ సిత్తం’.

తమిళ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమాకు సముద్రఖనినే దర్శకుడు. పవన్ కి స్టోరీ లైన్, సీన్స్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ రీమేక్ కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్రివిక్రమ్ తెలుగు వర్షన్ లో చాలా మార్పులు చేసి ఓ యంగ్ హీరోకి స్పేస్ క్రియేట్ చేశాడట. ఆ రోల్ ని సాయి ధరం తేజ్ తో చేయించాలని ఫిక్స్ అయ్యారు.

ఈ రీమేక్ సినిమా కంప్లీట్ చేశాక హరీష్ శంకర్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడు పవన్. ఆ వెంటనే సురేందర్ రెడ్డి సినిమాను కూడా కంప్లీట్ చేస్తాడు. రాజకీయ పరంగా చూస్తే పవన్ కి ఇంకా రెండేళ్ళే టైం ఉంది. ఈ గ్యాప్ లో కమిటయిన నాలుగు సినిమాలు ఫినిష్ చేసి ఫ్రీ అయిపోవాలి. ఆ తర్వాత రాజకీయంగా మళ్ళీ బిజీ అయి ఆంద్రప్రదేశ్ ఎలక్షన్స్ ప్రచారం చూసుకోవాలి. ఇక పవన్ మిగతా సినిమాలు ఎలక్షన్స్ తర్వాతే డిసైడ్ అవుతాయి.