దర్శకుడిగా రాజమౌళి తొలి సినిమా ‘స్టూడెంట్ నంబర్ వన్’ పూర్తయ్యే సమయానికే ఆయనకు జక్కన్న అనే పేరు వచ్చేసింది. ప్రతి సన్నివేశాన్నీ చాలా టైం తీసుకుని చెక్కుతుంటంతో అమరశిల్పి జక్కన పేరును ఆయనకు తగిలించేశారు జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల.
ఇక ఆ తర్వాతి కాలంలో ఆ పేరును సార్థకం చేసుకుంటూ ప్రతి సినిమానూ తనదైన శైలిలో చెక్కుతూ సాగిపోతున్నాడు జక్కన్న. గత పుష్కర కాలంలో రాజమౌళి ఏ సినిమా కూడా చెప్పిన సమయానికి విడుదల కాలేదు. ప్రతిదీ ఆలస్యవమతోంది.
చివరికి 2020 జులై 30న రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ను కూడా వాయిదా వేయక తప్పలేదు. జులై 30న కచ్చితంగా సినిమా వస్తుందా అని పోయినేడాదే విలేకరులు అడిగితే.. 2020లో మాత్రం గ్యారెంటీ అన్నాడు. కానీ మాట నిలబెట్టుకోలేకపోయాడు.
కేవలం సినిమాలు వాయిదా వేయడమే కాదు.. తన సినిమాలకు సంబంధించి ఏవైనా విశేషాలు పంచుకోవాలన్నా జక్కన్న సమయ పాలన పాటించట్లేదు. ఈ రోజు రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరిచుకుని ఉదయం 10 గంటలకు ఓ సర్ప్రైజ్ అంటూ ఊరించాడు ఎన్టీఆర్. తీరా చూస్తే చెప్పిన సమయానికి ఆ సర్ప్రైజ్ బయటికి రాలేదు. అందరూ డిజప్పాయింట్ అయ్యారు. సాయంత్రం 4 గంటలకు ముహూర్తాన్ని మార్చారు. రాజమౌళి జోక్యంతోనే ఈ ఆలస్యం అని ఎన్టీఆర్ చెప్పాడు. దీంతో అభిమానులకు మండిపోయింది.
రాజమౌళి మీద ఎంత అభిమానం ఉన్నప్పటికీ.. ఇలా ప్రతిసారీ వాయిదాల పర్వంతో నిరాశ పరుస్తుండటం అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఇలా ఆలస్యం చేయడాన్ని.. వాయిదాలు వేయడాన్ని రాజమౌళి సెంటిమెంటుగా ఏమైనా భావిస్తున్నాడా అంటూ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఆయనకు డిలే మౌళి, వాయిదాల మౌళి అంటూ కొత్త పేర్లు పెడుతూ తమ అసహనాన్ని చాటుకుంటున్నారు.
రాజమౌళి సార్.. తిడుతున్నారండీ
Gulte Telugu Telugu Political and Movie News Updates